గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు సత్వర చర్యలు చేపడుతున్నాం: చమురు శాఖ మంత్రి

 

Dharmendra
Dharmendra Pradhan

 

అగర్తల: గృహ అవసరాలలో వినియోగించే ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేది లేదని, రాయితీ
కొనసాగుతుందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ తెలిపారు. త్రిపుర రాజధాని అగర్తలలో
జరిగిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం కింద 20 కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్‌లు
అందజేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు సత్వర చర్యలో భాగంగా
బంగ్లాదేశ్‌ నుంచి త్రిపుర వరకు పైపులైన్లు వేస్తామని తెలిపారు. ఇంతకు పూర్వమే బంగ్లాదేశ్‌ వెళ్లి
పశ్చిమ బంగ నుంచి బంగ్లాదేశ్‌ పర్వతీపూర్‌కు డీజిల్‌ సరఫరాకు పైప్‌లైన్‌ వేయనున్నట్లు తెలిపారు.