గ్యాస్‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తేవ‌డం స‌రికాదు

YANAMALA
YANAMALA

అమ‌రావ‌తిః నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోని తెస్తామని జీఎస్టీ కౌన్సిల్ సెక్రటరీ ప్రకటనలు చేయడం సరికాదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. దేనినైనా జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. నేచురల్ గ్యాస్‌పై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోకుండా అన్ని రాష్ట్రాల సమ్మతితో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. 2017-18లో నేచురల్ గ్యాస్‌ ద్వారా ఏపీకి రూ.523 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అలాంటిది నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వచ్చే ఆదాయాన్ని కోల్పోతామని యనమల వాపోయారు.