గో ఆధారిత వ్య‌వ‌సాయంతో రైతుల‌కు ఐదురెట్ల లాభాలు

Praveen Togadia
Praveen Togadia

గుంటూరు: గుంటూరులో వీహెచ్‌పీ, భజరంగదళ్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌ట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయం వల్ల కలిగే మేలును వివరించారు. ఎన్నో ఉపయోగాలున్న గో ఆధారిత వ్యవసాయాన్ని రైతులందరూ ఆచరించాలని దీని ద్వారా వ్యవసాయ పెట్టుబడులు తగ్గడమే కాకుండా, ఇది రైతులకు ఎంతో సురక్షితమైన, సులభతరమైన ప్రక్రియని తెలిపారు. గో ఆధారిత వ్యవసాయంతో రైతులు ఐదురెట్లు లాభాలు సాధించే అవకాశం ఉందని ఆయ‌న తెలిపారు.