గోవా సియంను కలిసిన రాహుల్‌

rahul gandhi
rahul gandhi

పానాజీ: గోవాలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు ఆ రాష్ట్ర సియం మనోహర్‌ పారికర్‌ను కలిశారు. మంగళవారం ఉదయం పానాజీలో సియం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లిన రాహుల్‌ ఆయనతో కాసేపు సమావేశమయ్యారు. పారికర్‌ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు రాహుల్‌ పారికర్‌ను కలిసినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన ఫైల్‌ పారికర్‌ వద్ద ఉంది కాబట్టే ప్రధాని మోదిపై పైచేయి సాధించి గోవా సియంగా కొనసాగుతున్నారు అని రాహలు సోమవారం ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు.