గోవాలోను కాంగ్రెస్‌ కర్ణాటక తరహా వ్యూహం

Congress Party
Congress Party

పానాజి: కర్ణాటకలో అనుసరించిన విధానంతోనే గోవాలో కూడా అమలుచేసి బిజెపిని గద్దెదించేందుకు కాంగ్రెస్‌ వ్యూహం సిద్ధంచేసింది. ఇప్పటికే మహారాష్ట్రవాది గోమంతక్‌పార్టీతో తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో ఎంజిపి భాగస్వామిగా ఉంది. పార్టీ వ్యూహాలను ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు. ఎంజిపితో చర్చలుజరిపి ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తుందని, కోస్తా రాష్ట్రంనుంచి బిజెపిని బైటికి పంపించేందుకు వ్యూహం సిద్ధం అవుతోందని వెల్లడించారు. కర్ణాటకలోని ప్రాంతీయ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినట్లే గోవాలో కూడా చిన్నపార్టీకి అత్యున్నతపదవిని ఇచ్చి బిజెపినిముందు గద్దెదించే వ్యూహంతో ఉంది.అయితే ఎంజిపి నాయకుడు రాష్ట్ర ప్రజాపనుల మంత్రి రామకృష్ణ సుదీన్‌ ధావాలికర్‌మాత్రం కాంగ్రెస్‌తో ఎలాంటి అవగాహనలేదని కొట్టివేసారు. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఎంజిపితో చర్చలుజరుగుతున్నాయని, వారుసైతం మద్దతుకు సానుకూలంగా ఉన్నట్లు చెపుతున్నారు. ముందు గోవానుంచి బిజెపిని గద్దెదించడమే లక్ష్యంగా వెల్లడించారు.ముఖ్యమంత్రి పదవిని ఇవ్వచూపారా అన్న ప్రశ్నపై ఈవ్యవస్థపై ఎలాంటి మద్దతిచ్చేందుకైనా సిద్ధమేనని కాంగ్రెస్‌నేతలు చెపుతున్నారు. అయితే ఇప్పటివరకూ అలాంటి చర్చలు రాలేదని ధవాలికర్‌ చెపుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి మనోహర్‌ పార్కిర్‌ లేకపోవడంతో ధావలికర్‌ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి పారిక్కర్‌ అమెరికాలో ప్రస్తుతం చికిత్సపొందుతున్నారు. స్వతంత్రులు, ఎంజిపి నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్‌నేతలు చెపుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే గోవాలో కాంగ్రెస్‌మైండ్‌గేమ్‌ప్రారంభించిందనే చెప్పాలి. ఎంజిపితోపాటు గోవా ఫార్వార్డ్‌ పార్టీతో సైతం చర్చలు కొనసాగుతున్నట్లు కాంగ్రెసక్ష్‌నేత వెల్లడించారు. గోవాలో కర్ణాటకప్రభావం మరింత సానుకూలంగా ఉందని, ఇప్పటికే గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్‌ పార్టీని ఏకైక అతిపెద్ద పార్టీగా గుర్తించి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖిచ్చామని చెపుతున్నారు. 40మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు, బిజెపికి 14 మందిఎమ్మెల్యేలున్నారు. ఎంజిపి,జిఎఫ్‌పికి ముగ్గురుచొప్పున ఉన్నారు. ఎన్‌సిపి ఒకసభ్యుడున్నారు. మరో ముగ్గురు స్వతంత్రులున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే సంకీర్ణఆనికి 21మంది సభ్యులు అవసరం అవుతారు. కాంగ్రెస్‌ పార్టీ పారిక్కర్‌ లేని సమయంలోపూర్తికాలపు ముఖ్యమంత్రి కొనసాగాలని పట్టుబడుతూ వచ్చింది. పారిక్కర్‌ముఖ్యమంత్రిగాకొనసాగేంతవరకూ తమ మద్దతు ఉంటుందని ఎంజిపి, జిఎఫ్‌పిలు స్పష్టంచేశాయి. తమ మద్దతు పారిక్కర్‌కుకానీ బిజెపికి కాదని స్పష్టంచేసాయి. పారిక్కర్‌ లేని సమయంలోముగ్గురుసభ్యుల కమిటీ దైనందిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. ధవాలికర్‌, సర్దేశాయి, బిజెపి ఫ్రాన్సిస్‌ డిసౌజాలు సైతం ఈ కమిటీలో ఉన్నారు. ఇదిలా ఉంటేముందస్తుగా రికార్డుచేసిన వీడియోసందేశంలో పారిక్కర్‌ మాట్లాడుతూ తాను త్వరలోనే తిరిగిస్త్నుట్లు ప్రకటించారు. గడచిన రెండునెలలుగా మీమధ్యలేనని, ప్రస్తుతం చికితక్సజరుగుతోందని, గోవాలో వచ్చే కొన్నివారాల్లోనే మీముందుంటానని వెల్లడించింది.