గోవాకు మరొ సిఎం?

Manohar Parikar
Manohar Parikar

పణజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌(62) అనారోగ్యంతో శనివారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బిజెపి కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. ముఖ్యమంత్రి ఆరోగ్యం కుదటపడే వరకు సిఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న విషయమై ఈ బృందం రాష్ట్రనికి రావడం గమనార్హం