గోబి బజ్జీ

RUCHI
RUCHI

గోబి బజ్జీ

కావలసినవి
శనగపిండి-500గ్రా, మైదాపిండి-300గ్రా, బియ్యంపిండి-200గ్రా ఉప్పు-కొద్దిగా, సోడా ఉప్పు-చిటికెడు, నూనె-వేయించటానికి సరిపడ కారం-ఒక స్పూన్‌, క్యాబేజి రేకులు-కొద్దిగా
తయారుచేసే విధానం
క్యాబేజి రేకులను మీడియంసైజులో ముక్కలు కోసి ఉంచుకోవాలి. తరువాత పిండిలను అన్నింటిని కలిపి కొద్దిసేపు నాననివ్వాలి. పిండి బాగా నానిన తరువాత క్యాబేజి ముక్కలను అందులో వేసి బాండీలో నూనె వేసి అది కాగిన తరువాత క్యాబేజి ముక్కలను తీసి అందులో వేసి కొద్దిగా వేగిన తరువాత తీసి మరలా నూనెలో వేసి వేయించాలి. ఇది రెండు రోజులు నిల్వ ఉంటాయి.