గోదావరిలో పడవ బోల్తా, 10 మంది గల్లంతు

GODAVARI RIVER
GODAVARI RIVER

రాజమండ్రి: ఇటీవల వాడపల్లి దగ్గర గోదావరి నదిలో జరిగిన ఘోరం మరవక ముందే అదే గోదావరిలో నాటుపడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతయాయ్యరు. ఐ.పోలవరం మండలం పశువుల్లంక దగ్గర ఘటన జరిగింది. ప్రమాద సమయంలో నాటుపడవలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. పశువుల్లంక నుంచి వలసలతిప్పకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలికి రెవెన్యూ, పోలీసు యత్రాంగం బయల్దేరారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.