గైర్హాజ‌రు విష‌యంలో ఉద్యోగినిపై దాష్టీకం

B N
B N

చెన్నై : విధులకు గైర్హాజ‌రు విషయంలో ఓ ఉద్యోగినిపై ల్యాబ్ యజమాని స్పిరిట్‌తో దాడి చేసి నిప్పంటించిన ఘటన తమిళనాడులోని మడిపక్కంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. యమున(33) అనే మహిళ కొన్ని నెలల క్రితం.. పార్ట్‌టైం ఉద్యోగినిగా ఓ ప్రయివేటు ల్యాబ్‌లో చేరింది. అయితే ఈవిడ విధుల్లో చేరినప్పటి నుంచి ల్యాబ్‌కు సరిగా రావడం లేదు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ల్యాబ్ యజమాని.. ఆదివారం రాత్రి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. సహనం కోల్పోయిన రాజేష్.. ఆమెపై ల్యాబ్ స్పిరిట్ పోసి నిప్పంటించాడు. అక్కడున్న మిగతా సిబ్బంది బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 46 శాతం కాలిన గాయాలతో యమున బాధ పడుతోంది. యమున భర్త ఆనంద్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.