గేట్ త‌ర‌హాలో ఐఐటి- జేఈఈ

CAREER
CAREER

ఐఐటీ-జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) పరీక్షలను తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పరీక్షల నిర్వహణ ఉపసంఘం నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌) తరహాలోనే మే 20న ఈ పరీక్షను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు నిర్దేశిత సమయానికి కనీసం అరగంట ముందు పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి. హాల్‌టికెట్ల జారీ సమయంలో పూర్తిస్థాయి నిబంధనలను సూచించనున్నా రు. వివరాలిలా ఉన్నాయి..
అభ్యర్థులు పరీక్ష సమయానికి 30-40 ని మిషాల ముందు కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుని లాగిన్‌ అవ్వాలి.
పరీక్ష విధివిధానాలను అభ్యర్థులు 20 నిమిషాల్లో చదువుకోవాలి.
పరీక్షను రెండు సెషన్ల(ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30)లో నిర్వహిస్తారు. నిర్దేశిత సమయం దాటితే అనుమతించరు.
అభ్యర్థులు సైంటిఫిక్‌ కాలిక్యులేటర్‌ను తేవొద్దు. కంప్యూటర్‌ తెరపైనే వర్చువల్‌గా ఆ సదుపాయం ఉంటుంది. ఎలకా్ట్రనిక్‌ పరికరాలను నిషేధించారు.
పరీక్ష సమయంలో సాఫ్ట్‌వేర్‌ను ట్యాంప ర్‌ చేసినా, వేరే యాప్‌ను తెరిచినా.. విద్యార్థుల అభ్యర్థిత్వం రద్దయిపోతుంది