గృహ నిర్మాణశాఖకు కేటాయింపులు పెంపు!

housing
housing

ఎన్నికల వేళ వరాల కుమ్మరింత
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు కేటాయింపులు పెంచుతోంది. సామాన్యమధ్యతరగతి వర్గాల ఓటుబ్యాంకును పరిరక్షించుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం ముందు వ్యవసాయరంగంపై ఫోకస్‌ పెట్టింది. ఆ తర్వాత సహజంగానే గృహనిర్మాణంపై దృష్టికి తెచ్చింది. మొత్తం బడ్జెట్‌కేటాయింపుల్లో రూ.10వేల కోట్లు పెంపును చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుబాటులో పక్కాగృహాలు, ఆకర్షణీయనగరాలకకు ఎక్కువ నిధులు అవసరం అవుతున్నది. ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అందరికీ పక్కా ఇళ్లు పిఎం ఆవాస్‌యోజన స్కీంకు 50శాతం నిధుల పెంపు అవసరం అవుతుందని చెపుతోంది. బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.50వేల కోట్లు కావాలని కోరింది. పిఎం ఆవాస్‌యోజనకు సైతం 50 శాతంపెంపు ఉంటుందని అంచనావేసింది. ఈ కేటాయింపులు రూ.15వేల కోట్లనుంచి రూ.10వేల కోట్లవరకూ ఉంటుందని అంచనా. కొన్ని ప్రోత్సాహకాలు మరింతపెంచాల్సిన అవసరం ఉన్నందున ఈ రంగానికి కేటాయింపులుసైతం గత బడ్జెట్‌కంటే 10వేల కోట్లనుంచి 15 వేల కోట్లు వరకూ పెరుగుతాయని అంచనావేస్తున్నారు. రియాల్టీ రంగం ఏమంతగా ఆశలు పెట్టుకోలేదు. తాత్కాలిక బడ్జెట్‌లో కొంతమేరతక్కువ ఏంటుందని అంచనావేస్తోంది. కేవలం పన్నురాయితీలు ఉంటే చాలనిభావసిఉ్తంది. ఇక తాత్కాలిక బడ్జెట్‌లో సంక్షేమపథకాలు వివరాలు మాత్రమే ఉంటాయని అంచనా. అద్దె గృహనిర్హాణపథకాలకు సంబంధించి కొంత రాయితీ ఇస్తుందని అంచనా. వడ్డీ రాయితీలు, గృహరుణాల చెల్లింపుల్లోప్రోత్సాహకాలు రూ.2 లక్షలనుంచి రూ.3లక్షలవరకూ ఉంటుందని అంచనావేస్తోంది. ఇక జాతీయ రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధి మండలి కూడా నివాసిత ఆస్తులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన పన్నురేటు పదిశాతానికి మించకుండా చూడాలని చెపుతోంది. స్టాంప్‌ డ్యూటీని కూడా జిఎస్‌టిపరిధిలోనే ఉంచాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే.