గూగుల్ మ్యాప్స్ యాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్లు!

new features
new features

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఐఓఎస్ మ్యాప్స్ యాప్‌లో సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నది. ఐఓఎస్ డివైస్‌లలో గూగుల్ మ్యాప్స్‌ను వాడేవారు ఆ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేస్తే దాంతో ఈ ఫీచర్లను వాడుకోవచ్చు. ఐఓఎస్ అప్‌డేటెడ్ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో రియల్ టైం కమ్యూటింగ్ ఇన్ఫో పేరిట కొత్త ఫీచర్ లభిస్తున్నది. దీని సహాయంతో యూజర్లు తాము ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఆగినప్పుడు తమ చుట్టూ ఉండే ఏటీఎంలు, రెస్టారెంట్లు, ట్రాఫిక్ అప్‌డేట్స్, బస్సుల వివరాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతోపాటు యాప్‌లో కొత్తగా మెనూ బటన్లను అందిస్తున్నారు. దీంతో యూజర్లకు తమ చుట్టూ ఉన్న ప్రదేశాల గురించి సులభంగా తెలుస్తుంది. ఆండ్రాయిడ్ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో ఇప్పటికే ఈ ఫీచర్లు లభిస్తుండగా, తాజాగా ఐఓఎస్ డివైస్‌లలో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను వాడేవారికి కూడా ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు.