గులాబీ గూటికి దామోదర రాజనర్సింహా?

Damodara rajanarasimha
Damodara rajanarasimha

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో అలజడి… మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి టిఆర్‌ఎస్‌ చేరేందుకు సన్నాహాలు అవుతున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు కూడా ఆయన బాటలోనే వెళ్లనున్నారు. గత కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించకుండా ఉన్నట్లు దామోదర రాజనర్సింహా పార్టీ గుడ్‌ బై చెప్పి గులాబీ గూటికి చేరనున్నట్లు ఆయన అనుచరులు బహిర్గతంగానే చెబుతున్నారు. గత ఎన్నికలలో ఆంథోల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నటుడు బాబు మోహన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతే కాకుండా కొంతకాలంగా కాంగ్రెస్‌లో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న కినుక వహించినట్లు సమాచారం.