గులాబీ గూటికి టిడిపి నేత గండ్ర

TRS flag
TRS

జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లా టిడిపి అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మంథని టిడిపి ఇంచార్జీ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా టిడిపి అద్యక్షుడు నర్సింగరావుతో పాటు వేలాదిమంది టిడిపి కార్యకర్తలు నేడు గులాబీ గూటిలోకి చేరారు. మంత్రి కెటిఆర్‌ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కెటిఆర్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.