గులాబీ గూటికి చేరిక‌లు

TRS flag
TRS

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వివిధ పార్టీల్లోని చిన్న నాయకులే కాకుండా.. పెద్ద నాయకులు కూడా ఆకర్షితులవుతున్నారు. అభివృద్ధికి కలిసిరావాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో స్పందించి అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కే దామోదర్‌రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు వీరి అనుచరగణం పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి వీరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.