గులాబీ గూటికి చేరిక‌లు

TRS flag
TRS

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలప‌ర్వం కొనసాగుతూ ఉంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజక‌వ‌ర్గంలో కాంగ్రెస్‌, టీడీపీ ల నుంచి ద్వితీయ శ్రేణి సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ల‌క్ష్మారెడ్డి వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ల‌క్ష్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌కు ఆక‌ర్షితులై తెలంగాణ పున‌ర్నిర్మాణంలో భాగ‌స్వాములు అయ్యేందుకు తామంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.