గులాబించే ఆరోగ్యం

గులాబీలతో ఉపయోగాలెన్నో..

The uses with roses are numerous
The uses with roses are numerous

మంచు ముత్యాలను నిండుగా అంకరించుకున్న గులాబీలను చూస్తే మనసు పారేసుకోకుండా ఉండలేం కదా! రోజాపూలు అలంకరణకే అనుకోవద్దు. ఆరోగ్యాన్నీ అందిస్తాయి.
అవేంటో తెలుసుకుందాం…

గులాబీలకే ఉబ్జక, శతపత్రి, కర్ణిక అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటిల్లో శతపత్రి రకాన్ని ఆహారంలోనూ, ఔషధంగానూ ఎక్కువగా ఉప యోగిస్తారు.

వీటి రెక్కల్లో విటమిన్‌ ఎ, సిలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థాం పుష్కలంగా ఉంటుంది. పైటోకెమికల్స్‌, అసె న్షియల్‌ ఆయిల్స్‌ అధికంగా ఉండే రోజాలు చక్కని పోషకాహారం.

వీటి నుంచి తీసిన నీటిని గులాబీ ఆర్కమ్‌ అంటారు. గులాబీల నుంచి సేకరించిన సుగంధ తైలాన్ని ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కేక్స్‌, పుడ్డింగ్స్‌లో ఉపయోగిస్తారు.

కాఫీ, టీలకు బదులు గులాబీ కషాయం తాగితే కడుపులో మంట తగ్గడంతోపాటు చిగుళ్ల వాపు తగ్గుతుంది. ఈ పూలరెక్కలతో హల్వా చేసుకుంటారు. రెక్కలని పులియబెట్టి రోజ్‌వైన్‌ తయారుచేస్తారు.

గుల్‌కంద్‌ :

ఒక వంతు దేశవాళీ గులాబీ రెక్కలకు రెండు వంతుల పంచదార తీసుకుని.. గాజు జాడీలో ప్రతి రోజూ వేస్తూ ఎండలో ఉండాలి. ఇలా నెల రోజులు చేస్తే గుల్‌కంద్‌ తయారవుతుంది. దీనిని రోజుకు అరచెంచా చొప్పున తింటే స్త్రీలకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.