గురక ప్రమాదం

Snoring
Snoring

గురక ప్రమాదం

అతిగా తిని ఎక్కువగా గురకపెడుతూ సోమరితనంతో కాలం గడపకండని పెద్దవాళ్లు హెచ్చరించడం మనం వింటూనే ఉంటాము. గురక సోమరితనం వల్లనే కాకుండా కొన్ని వ్యాధులలో కూడా కనిపిస్తుంది. స్థూలకాయుల్లో, టాన్సి లైటిస్‌, ఫారింజైటిస్‌ వంటి వ్యాధులతో బాద µపడేవారిలో గురక కనిపిస్తుంది. ఏ వ్యాధి లేనివారు కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గురకపెడ తారు.

అతి సామా న్యంగా కనిపించే ఈ గురక మనిషి లావు పెరగడానికే కాకుండా, గుండెపోటు, ఇతర గుండె జబ్బు లకు దారితీస్తుందని పరిశోధకులు అంటున్నారు. సాధార ణంగా గురకపెట్టేవారు వెల్లకిలా పడుకుని సగం నోరు తెరుచుకుని ఉంటారు. శ్వాస కూడా సగం ముక్కుద్వారా, సగం నోటి ద్వారా తీసుకుంటారు. గురక పెట్టడానికి లింగభేదం, వయోభేదం లేకపోయి నప్పటికీ, ఎక్కువగా మగవారిలోనూ, వృద్ధులలోనూ కనిపిస్తుంది. ఏ కారణం చేతనైనా నాసికా రంధ్రాలు మూసుకుపోయి నప్పుడు పెద్దగా శ్వాస తీసుకుంటాము. కదలికల వలన పలు రకాల స్థాయిలలో గురక వస్తుంది.