గుజరాత్‌లో గెలిచి ఓడిన బిజెపి!

BJP
BJP

గుజరాత్‌లో గెలిచి ఓడిన బిజెపి!

ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురుచూసే గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2017 డిసెంబర్‌ 18న వెలువడినాయి. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు 2019 ఏప్రిల్‌, మే నెలల్లో పార్లమెంట్‌కు జరుగనున్న ఎన్నికలను ప్రభావితం చేయగలవని దేశంలో చాలా మంది రాజకీయ నాయకుల అభిప్రాయంగా కనపడుతున్నది. అంతేగాక, గుజరాత్‌లో గత 22 సంవత్సరాల నుండి వరుసగా బిజెపి అధికారంలో కొనసాగుతున్నది. కనుక అధికారాన్ని నిల బెట్టుకోవాలని బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పరిగణించిం ది.

అలాగే కాంగ్రెస్‌ కూడా అధికారాన్ని ఎలాగైనా ఈసారి చేజి క్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డి రాహుల్‌ గాంధీ నాయకత్వంలో విస్తృత ప్రచారం చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అక్కడి ప్రజలు ఐదేళ్లకొకసారి బిజెపి, కాంగ్రెస్‌లను కేరళలో మాదిరిగా మార్చు తున్నారు. అందువల్ల ఆ రాష్ట్రంలో ఎన్నికలను గురించి అంత సీరియస్‌గా ఈ రెండు పార్టీలు తీసుకోలేదు. గుజరాత్‌లో రెండు విడతలుగా పోలింగ్‌ జరిగింది. డిసెంబర్‌ 9న 89 సీట్లకు, డిసెంబర్‌ 14న 93 సీట్లకు పోలింగ్‌ జరిగింది. సగటున 70శాతం ఓట్లు పోలయ్యాయి. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 92 స్థానాల్లో గెలుపొందాలి. డిసెంబర్‌ 18న జరిగిన ఓట్ల లెక్కింపులో బిజెపికి 99స్థానాలు, కాంగ్రెస్‌కు 80స్థానాలు, ఇతరులకు మూడు స్థానాలు వచ్చాయి. కనుక అతి కష్ట మీద బిజెపి గెలుపొందింది. అంటే సాధారణ మెజారిటీకి కేవలం ఏడు స్థానాలు అధికంగా వచ్చాయన్న మాట. బిజెపికి 2007 సంవత్సరంలో 117 స్థానా లు, 2012 సంవత్సరంలో 115స్థానాలు, ఇప్పుడు 99 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2007లో 59స్థానాలు, 2012లో 61స్థానా లు రాగా, ఇప్పుడు 80 స్థానాలు వచ్చాయి. బిజెపి నాయకులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి తమకు 150 స్థానాలు వస్తా యని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు 2017 నవంబర్‌ 9న పోలింగ్‌ జరిగింది. డిసెంబర్‌ 18న జరిగిన ఓట్ల లెక్కింపులో బిజెపికి 44 స్థానాలు, కాంగ్రెస్‌కు 21స్థానాలు, ఇతరులకు మూడు స్థానాలు వచ్చాయి. 2012 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బిజెపికి 26 స్థానాలు, కాంగ్రెస్‌కు 36 స్థానాలు, ఇతరులకు ఆరు స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ గెలుపొందగా, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడైన ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ ఓడిపోవడం జరిగింది.

అయితే గుజరాత్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి విజ§్‌ురూపాని గెలుపొందాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు నవంబర్‌9న జరుగగా, గుజరాత్‌ లో డిసెంబర్‌ 9,14 తేదీలలో జరిగాయి. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు ఎన్నికల ఫలితాలకోసం డిసెంబర్‌ 18వరకు ఎందుకు ఎదురుచూ డాల్సివచ్చింది? నవంబర్‌ 10 లేక 11 తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఉండవచ్చు కదా. హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం గుజరాత్‌ ఎన్నికల్లో పడుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాల భయం. ప్రజావ్యతిరేకత ఉన్నందు వల్ల రెండు రాష్ట్రాల్లో బిజెపి గెలుస్తుందనే నమ్మకం, వి శ్వాసం బిజెపి నాయకులలో ఎవ్వరికీ లేదు. అందువల్లనే హిమా చల్‌ప్రదేశ్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను, పోలింగ్‌ తేదీని ప్రకటించిన ఎన్నికల సంఘం గుజరాత్‌ విషయం వచ్చే సరికి నెల రోజులు వాయిదా వేసిన విషయం చాలా స్పష్ట్టంగా తెలుస్తున్నది. అందరికి అర్థమైంది. ఎన్నికల తాయిలాల కోసం ప్రాజెక్టులకు పథకాలకు శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు మోడీకి ఎన్నికల సంఘం వ్యవధిని ఇచ్చింది సుమా! తాయిలాలు ప్రకటించడం, శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు అలాగే జరిగాయి. భారతదేశ చరిత్రలో ఒక రాజ్యాంగ సంస్థ మొట్టమొదటిసారి తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయింది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగింది.

ఇక ఈ ఎన్నికల్లో కూడా నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పోటీ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్లందరూ ధనబలానికి, కండబలానికి ప్రతీకలు! హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ కోవకు చెందిన అభ్యర్థులు 50 శాతం ఉన్నారంటే నాకైతే ఆశ్చర్యంవేయడం లేదు. ఎందుకంటే, బూర్జువా ఎన్నికల్లో ఇలాంటి బాపతువాళ్లు ప్రవేశించ డం సర్వసాధారణం. 68 స్థానాలకు పోటీ చేసిన 338 అభ్యర్థు లలో 158 మంది కోటీశ్వర్లు కాగా 61 మంది అభ్యర్థులు నేర చరిత్ర ఉన్నవారు. ఈ 338 మంది అభ్యర్థుల మొత్తం ఆస్తులు రూ. 1,352 కోట్లు, అలాగే గుజరాత్‌లో దాదాపు 1500 మంది నామినేషన్‌ వేసిన అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగగా, అందులో దాదాపు 336 అభ్యర్థులకు నేరచరిత్ర కలిగినవారుగా నమోదైంది. పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులలో దాదాపు 35 శాతం మందికి నేరచరిత్ర ఉంది. ఇక ఎన్నికల హింస గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది.వాస్తవం చెప్పాలంటే ప్రజలకు ప్రాతి నిధ్యంలేని చట్టసభలు. ఓటుహక్కు మాత్రం అందరికి ఉంది. కాని 90 శాతం మంది ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినా ఓట్లు వేసేవారి సంఖ్య సరాసరిన 60 శాతానికి మించదు.

అంటే దేశంలో 40 శాతం మంది ప్రజలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. బహిష్కరిస్తున్నారని అర్థమవ్ఞతుంది. ఈ ఎన్నికల్లో కూడా గుజరాత్‌లో ఏ అభ్యర్థికి ఓట్లు వేయడం లేదని 5.5 లక్షల మంది ‘నోటా (నన్‌ టు ది అబొవ్‌) బటన్‌ను నొక్కి తమ నిరసనను తెలియచేశారు. ఇది చట్టబద్ధమే కదా. హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు నోటా బటన్‌ను నొక్కి పోటీ చేస్తున్న అభ్యర్థులను తిరస్కరించారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ నెహ్రూ కుటుంబాన్ని నెహ్రూను విమర్శించినందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ తీవ్రంగా స్పందించి మోడీ ‘నీచుడనివ్యాఖ్యానించడంతో ఎన్నికల వాతావరణం రెండు రాష్ట్రాల్లో మరింత వేడెక్కింది.అలా వ్యాఖ్యానించడం తప్పే.

గుజ రాత్‌ మొదటి విడత పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు ఇలా జరగడంతో మొదటి విడత ప్రచారానికి టైమ్‌ ముగియడంతో మోడీ అయ్యర్‌ వ్యాఖ్యలను రెండవ విడత ఎన్నికల ప్రచారంలో తనకు అనుకూలంగా ఉపయోగించుకొని గుజరాతీయుల సెంటి మెంట్‌ను రేకెత్తించడానికి తీవ్ర ప్రయత్నం ప్రచారం చేశారు. ‘నేను గుజరాత్‌కు చెందిన వాడిని.అయ్యర్‌ గుజరాత్‌ప్రజలను అవమాన పరచాడు. నేను వెనుకబడిన కులానికి చెందిన వాడిని. అయ్యర్‌ వెనుకబడిన కులాలవారందని నీచులుగా చూస్తున్నాడు. నేను దేశ ప్రజలకు ప్రధాన మంత్రిని. కనుక దేశ ప్రజలందరిని కూడా అవ మానపరిచినట్లుగానే పరిగణించాలి అని మోడీవాపోయారు. కొంత మేరకు ప్రజల సానుభూతిని మోడీ పొందారు. మణిశంకర్‌ ఇంట్లో భారత్‌-పాకిస్థాన్‌ దేశాలమధ్య నెలకొన్న సమస్యలను శాంతియు తంగా పరిష్కరించుకోడానికి, పాకిస్థాన్‌ మాజీ రాయబారి ప్రస్తుత రాయబారి, భారత మాజీ ప్రధాన మంత్రి, భారత మాజీ ఉపరాష్ట్ర పతి, కొద్ది మంది ఇతర ప్రముఖులతో పాత్రికేయులతో జరిగిన సమావేశంలో, గుజరాత్‌ ఎన్నికలను గురించి చర్చించారని నరేంద్ర మోడీ గోబెల్స్‌ప్రచారం చేశారు. ఈ ఆరోపణలను, ప్రచారాన్ని డాII మన్మోహన్‌ సింగ్‌ తదితరులు తీవ్రంగా ఖండించారు.

వి.జయరాముడు

(రచయిత: ప్రభుత్వ ఉపకార్యదర్శి(రిటైర్డ్‌)