గుజరాత్‌పై ఢిల్లీ విజయం

PANTH1
PANTH

గుజరాత్‌పై ఢిల్లీ విజయం

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ పదవ సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో గురువారం ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌ భారీ స్కోరు సాధించింది.సురేశ్‌ రైనా 43 బంతులు ఆడి 5 బౌండరీలు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేయగా,దినేశ్‌ కార్తీక్‌ 34 బంతులు ఆడి 5 బౌండరీలు,5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు.దీంతో ఇద్దరు హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు.నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ 7 వికెట్లకు 208 పరుగులు చేసింది.ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ బ్యాటింగ్‌కు దిగి 3 వికెట్ల నష్టానికి 17.3 ఓవర్లలో 214 పరుగులు సాధించింది.దీంతో గుజరాత్‌ లయన్స్‌పై ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌7 వికెట్లతో ఘన విజయం సాధించింది.గుజరాత్‌ భారీ స్కోరు చేసినా ఢిల్లీ విజయం సాధించింది.

దీంతో ఢిల్లీ భారీ స్కోరు వృధాఅయినట్లే.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే సమస్య ఏర్పడింది.రబాడ వేసిన ఇన్నింగ్స్‌ రెండవ ఓవర్‌ మొదటి బంతికి మెక్‌కలమ్‌ 1 పరుగు వద్ద ఔటయ్యాడు.రెండవ బంతికి డ్వేన్‌ స్మిత్‌ 9 పరుగుల వద్ద రనౌట్‌ కావడంతో లయన్స్‌కష్టాల్లో పడింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన సురేశ్‌ రైనా,దినేశ్‌ కార్తీక్‌ గుజరాత్‌ స్కోరు బోర్డుకు పునాది వేశారు.రైనా ఆరంభంలో మెరుపు బ్యాటింగ్‌తో సత్తా చాటితే కార్తీక్‌ సహకారం అందిస్తూ వచ్చాడు

ఈ క్రమంలోనే వీరిద్దరు తమ హాఫ్‌ సెంచరీలను పూర్తి చేశారు.జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించిన అనంతరం ఇద్దరూ వేగం పెంచారు.ఢిల్లీ పదునైన బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ వచ్చారు.అయితే షమీ వేసిన 14వ ఓవర్‌లో రైనా రనౌటయ్యాడు.దీంతో 133 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది.అనంతరం కొద్ది సమయంలోనే జట్టు స్కోరు 158 పరుగుల వద్ద కార్తీక్‌ కూడా వెనుదిరిగాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన అరోన్‌ఫించ్‌ 27 పరుగులతో ఆఖరులో విరుచుకుపడి భారీ స్కోరు దిశగా అడుగులు వేశాడు.ఇషాన్‌ కిషన్‌ 4 పరుగులు,పాల్క్‌నర్‌ 1 పరుగుతో నిరాశ పరిచారు.

చివర్లో క్రీజులోకి వచ్చిన జడేజా 18 పరుగులు ఆఖరి ఓవర్లలో రెండు భారీ సిక్సర్లు బాదడంతో ఢిల్లీకి 209 పరుగులు టార్గెట్‌ నిర్ధేశించగలిగింది. దుమ్మురేపిన రిషబ్‌ పంత్‌ గుజరాత్‌ లయన్స్‌ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగులు చేసింది.ఓపెనర్‌ శాంసన్‌ 31 బంతులు ఆడి 7 సిక్సర్లతో 61 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీ చేసి జడేజా బౌలింగ్‌లో ఫాల్కనర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు.ఇక మరో ఓపెనర్‌ నయర్‌ 11 బంతులు ఆడి 2 బౌండరీలతో 12 పరుగులు చేసి సంగ్వన్‌ బౌలింగ్‌లో కార్తీక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు.రిషబ్‌ పంత్‌ గుజరాత్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 43 బంతులు ఆడి 6 బౌండరీలు,9 సిక్సర్లతో థంపీ బౌలింగ్‌లో 93కార్తీక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వెనుదిరిగాడు.ఇతనికి సెంచరీ తృటితో తప్పిపోయి ఢిల్లీకి నిరాశను కలిగించింది.అయ్యర్‌ 8 బంతులు ఆడి 2 సిక్సర్లతో 14 పరుగులు,అండర్‌సన్‌ 12 బంతులు ఆడి 2 సిక్సర్‌తో 18 నాటౌట్‌గా నిలిచారు.