గుండెపోటుతో దాసరి కన్నుమూత: కిమ్స్‌

Dasari (file)
Dasari (file)

గుండెపోటుతో దాసరి కన్నుమూత: కిమ్స్‌

హైదరాబాద్‌: ప్రముఖ సినీదర్శకుడు దాసరి నారాయణరావు గుండెపోటుతో కన్నుమూశారని కిమ్స్‌ వైద్యులు తెలిపారు.. తీవ్ర అస్వస్థతతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 7 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.. కాగా దాసరి పార్ధీవదేహాన్ని తన స్వగృహానికి తరలించనున్నారు.