గుండెజబ్బులకు కారణమయ్యే అంశాలపై అవగాహన

Heart Attack
Heart Attack

గుండెజబ్బులకు కారణమయ్యే అంశాలపై అవగాహన

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక శాతం మరణాలు గుండె జబ్బుల కారణంగా సంభవిస్తున్నాయి. గుండెజబ్బులకు కారణమయ్యే ప్రమాదకర అంశాలపై అవగాహన కలిగితే ఈ వ్యాధులను సమర్థ వంతంగా నివారించవచ్చు. ఛాతీలో నొప్పి (యాంజైనా పెక్టోరిస్‌): సాధారణంగా యాంజైనా పెక్టోరిస్‌ అనే పదం గుండె పోటుకు సంబం ధించినది చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఛాతీ (పెక్టోరల్‌) ప్రాంతంలో వచ్చే నొప్పుల న్నింటినీ ఈ పదం సూచిస్తుంది.

యాంజైనా అనే పదం గుండె కండరాలకు ఆక్సిజన్‌ తగ్గడం ద్వారా కలిగే ఛాతీ నొప్పిని సూచిస్తుంది. ఛాతీలో నొప్పి అత్యంత సహజంగా కనిపించే సమస్య. ఛాతీలో నొప్పి రాగానే బాధితులు తీవ్రంగా భయపడ తారు. మరీ ముఖ్యంగా మధ్య వయ స్కులకు ఛాతీలో నొప్పి వస్తే మరింతగా భయపడతారు. సాధారణంగా చాలా కేసుల్లో ఛాతీలో నొప్పి అనేది జీర్ణకోశ సంబంధ కారణాలతో కని పిస్తుంది. దీనికి ఆహారంలో, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అయితే ముందుగా ఒక విషయాన్ని నిర్ధారించు కోవాలి. ఈ నొప్పి అజీర్ణం కారణంగా కలుగుతున్నదా? లేక నిజంగానే గుండెకు సంబం ధించిన సమస్యతో కలుగుతున్నదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం అవసరం.

అది గుండె పోటును సూచిస్తుంటే తక్షణమే వైద్య సహాయం పొందాలి. గుండెపోటుకు గురయ్యే వ్యక్తులు వైద్య సహాయం పొందడంలో ఆలస్యం చేస్తుంటారు. దీనికి గుండెపోటుకు సంబంధించిన లక్షణాలను, వాటి తీవ్రతను వారు సరిగ్గా గుర్తించలేకపోవడమే కారణం. వైద్య సహాయం పొందడంలో జరిగే జాప్యం కారణంగా ప్రతియేటా సుమారు 3 లక్షల మంది ఆసుపత్రికి చేరేలోగానే ప్రాణాలు కోల్పో తున్నారు. మీ వయస్సు 35 సంవత్సరాలు దాటి, ఛాతీలో నొప్పి వస్తుంటే, బహుశా అది గుండెపోటు అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వెంటనే మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించడం కాని, ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం పొందడం కాని చేయాలి. ఊపిరితిత్తులకు చెందిన అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు కూడా ఛాతీలో నొప్పి రావడానికి కారణమవుతాయి. తీవ్రత తక్కువగా ఉండే కొన్ని అంశాలు కూడా ఛాతీలో నొప్పికి కారణమవుతాయి. అయినప్పటికీ వాటికీ వైద్య సహాయం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.

ఛాతీ నొప్పికి కారణాలు :

జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఛాతీలో నొప్పికి కారణమవుతాయి. ఆహారం తీసుకున్న కొద్ది గంటలకు నొప్పి ఆరంభమై, ముందుకు వంగి నప్పుడు కాని, పడుకు న్నప్పుడు కాని నొప్పి మరింత ఉధృతమవుతుంది. జీర్ణకోశంలోనుంచి ఆమ్లాలు ఆహారనాళంలోకి ఎగదన్నడం వల్ల ఛాతీలో మంట కలుగుతుంది. ఇది సాధారణంగా హయేటస్‌ హెర్నియాతో బాధపడు తున్న వారిలోనూ, ఆహార నాళంలో సమస్యలు ఉన్నవారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది.

గుండె జబ్బు:

సాధారణంగా 40 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో ఛాతీలో నొప్పి వస్తే అది గుండె జబ్బుకు కాని, గుండెపోటుకు కాని సంబంధించిన లక్షణమై ఉంటుంది. గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అడ్డంకి వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ఈ స్థితిని ఇష్కిమియా అంటారు. కరొనరీ ధమనిలో అసంపూర్తి అడ్డంకి ఉంటే కరొనరీ సంబంధిత యాంజైనాకు అది కారణమవుతుంది. దీనిలో ఏదైనా పని చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి వస్తుంది. విశ్రాంతి తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. గుండెను చుట్టి ఉండే పొర వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. అయితే యాం జైనా నొప్పితో పోల్చినప్పుడు ఈ రకమైన నొప్పి బాగా ఊపిరి తీసుకున్న ప్పుడు మరింత ఎక్కువ అవుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు ఊపిరితిత్తులకు చెందిన అనేక రకాల ప్రాణాంతక సమస్యలు కూడా ఛాతీలో నొప్పికి కారణమవు తాయి. న్యూమో థొరాక్స్‌ అనే సమస్యలో ఛాతీలో నొప్పి వస్తుంది. శ్వాస తీసుకున్నప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.

ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ రక్తనాళాల్లో ఏర్పడిన రక్తపు గడ్డ సమస్యలో కూడా ఇలాగే ఉంటుంది. ఈ సమస్యను పల్మొనరీ ఎంబాలిజం అంటారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫ్లమేషన్‌లో లేదా ఊపిరి తిత్తులను చుట్టి ఉండే పొర ఇన్‌ఫ్లమేషన్‌లో ఛాతీలో నొప్పి, హ్రస్వశ్వాస ఉంటాయి. వీటితో పాటు అనుబంధ లక్షణాలుగా దగ్గు, జ్వరం ఉంటాయి. ఛాతీలో నొప్పి ఉండి జ్వరం లేకుండా, దగ్గినప్పుడు పసుపు రంగులో కళ్లె వెలువడుతుంటే అది బ్రాంకైటిస్‌ అనే వ్యాధి వల్ల అయి ఉండవచ్చు. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఛాతీలో నొప్పి ఉండి, అది మెడ వెనుక భాగానికి పాకు తున్నట్లయితే బహుశా అది ఎముకలకు సంబంధించిన సమస్యతో ఏర్పడినదై ఉండవచ్చు. అరుదుగా కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు వివిధ స్థాయిలో ఉండే ఛాతీ నొప్పులకు కారణమవుతాయి.

కండరాలు బిగప ట్టేయడం, ఛాతీ ఎముకలు విరగడం, వెన్నెముక ఆర్థరైటిస్‌ సమస్యకు గురి కావడం మొదలైన సమస్యలు కూడా ఛాతీలో నొప్పి రావ డానికి కారణ మవుతాయి. హెచ్చరికలను గుర్తించండి గుండెపోటు ఈ కింద పేర్కొన్న అంశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలను కలిగి ఉంటుంది. ఈ అంశాలను గుర్తుంచుకోవడం ద్వారా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు తక్షణ వైద్య సహాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఛాతీ మధ్యలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, నొప్పి లేదా ఏదో లాగేస్తున్నట్లు, నొక్కుతున్నట్లు ఉండటం వంటి లక్షణాలు కనీసం రెండు నిముషాలపాటు లేదా అంతకంటే ఎక్కువసేపు కొనసాగడం.

ఛాతీలో ఒక మాది రినుంచి తీవ్ర స్థాయిలో నొప్పి ప్రారంభమై భుజాలు, మెడ, దవడలు, చేతులకు వ్యాపించడం ఛాతీ నొప్పితోపాటుగా కళ్లు తిరు గుతున్నట్లు అని పించడం, స్పృహ తప్పడం, చల్లటి చెమటలుపోయడం, వికారం, వాంతులు, హ్రస్వశ్వాస. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే బాధితుడిని వెంటనే ఆసుపత్రికి చికిత్స కోసం తరలించాలి. గుండె జబ్బుల నివారణకు కొన్ని సూచనలు: గుండె జబ్బులు సోకడానికి కారణమయ్యే ప్రమాదకర అంశాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి నియం త్రించడానికి అవకాశం కలిగినవి, నియం త్రించలేనివి. నియంత్రించగలిగే అంశాలు : ధూమపానం, అధిక రక్తపోటుకు చికిత్స తీసుకోక పోవడం, మానసిక ఒత్తిడి, ఆం దోళన, కోపం, జీవనశైలిలో మార్పులు, స్థూలకాయం, మధుమేహ వ్యాధికి తగిన చికి త్స తీసుకోకపోవడం.