గుంటూరులో మాజీ మంత్రి పర్యటన

Galla Aruna
Galla Aruna

గుంటూరు: మాజీ మంత్రి, గల్లా జయదేవ్‌ తల్లి గల్లా అరుణ నగరంలో పర్యటించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టిడిపి ఇన్‌చార్జీ మద్దాలి గిరితో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. సందివెలుగులో జరుగుతోన్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన వారికి నష్టపరిహారం సక్రమంగా అందేలా స్థానిక నేతలు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ర ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.