గిరిపుత్రులకు వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నాం

AP Minister Kamineni
AP Minister Kamineni

గిరిపుత్రులకు వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నాం

రంపచోడవరం: ఏజన్సీ ప్రాంతంలో మ్తంరి కామినేని శ్రీనివాస పర్యటిస్తున్నారు.. మంత్రితోపాటు తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ సుజాత శర్మ, డిఎంహెచ్‌ఒ ఓ.కే. చంద్రయ్య ఉన్నారు. ఈ సందర్భంగ మంత్రి కామినేని రంపచోడవరం ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్న గిరిజనుల వివరాలు అడిగితెలుసుకున్నారు. వీరందరికీ వైద్యసౌకర్యాల కల్పించే బాధ్యత ప్రభుత్వందేనని అన్నారు.. చాపరాయి సంఘటనను ఒక కేస్‌ స్టడీ చేస్తున్నామన్నారు.. గిరిపుత్రులకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తామన్నారు..ప్రతిరోజు సిఎంకు ఇక్కడ పరిస్థితులు తెలియజేస్తున్నామన్నారు.. మారేడుమిల్లి ప్రాథమికఆరోగ్య కేంద్రాన్ని కూడ ఆయన పరిశీలించారు.. జ్వర బాధితులు తెలిపిన గ్రామాల్లో బ్లడ్‌శాంపిల్స్‌ సేకరించాలని వైద్యాధికారులను మంత్రి కామినేని ఆదేశించారు.