గిరిజనతండాలో గిరిజనులే సర్పంచులు

new panchayat raj  of tribals
new panchayat raj of tribals

హైదరాబాద్‌: ఎన్నో దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన గిరిజనతండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడంతో పాటు వంత శాతం గిరిజనులు ఉన్నటువంటి తండాలను గిరిజనులకే రిజర్వు చేయనుండడంతో ఇక తమ తండాలను తామే పాలించికుంటామని గిరిజనులలో ఆనందోత్సావాలు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇక రిజర్వేషన్‌ల ప్రక్రియను కొనసాగించనుంది. ఈసందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 127512 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఇందులో వందశాతం గిరిజన జనాభా ఉన్న 1177 తండాల (ఇప్పుడు పంచాయతీలు అయ్యాయి)లో గిరిజనులే సర్పంచ్‌లు కానున్నారు.