గార్డెన్‌ రీచ్‌ షిప్‌ ఐపిఒ గడువు పెంపు

IPO
IPO

న్యూఢిల్లీ: సోమవారం 24 నుంచి షురూవైన ప్రభుత్వ రంగ కంపెనీ గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ ఐపిఒ ముగింపు గడువును ప్రభుత్వం మూడు రోజులపాటు పొడిగించింది. దీంతోపాటు దీని ధరను కూడా సవరించింది. మొదట దీని ధర రూ.115నుంచి రూ.118వరకు ఉంటే ఇప్పుడు అది రూ.114నుంచి రూ.118గా సవరించింది. దీనివల్ల రూ.340 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 2.92 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. బుధవారానికల్లా 1.97 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్స్‌ దాఖలు కావడంతో ప్రభుత్వం గడువును పొడిగించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మినీరత్న కంపెనీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 120 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రమోట్‌ చేసిన జిఆర్‌ఎస్‌ఇ లిమిటెడ్‌ ప్రధానంగా దేశ నావికా దళం, తీర ప్రాంత రక్షణ విభాగాలకు అవసరమయ్యే ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఆధునిక, వ్యూహాత్మక వార్‌షిప్పులను తయారుచేస్తోంది. వీటిలో ప్రైగేట్స్‌, ఫ్లీట్‌ ట్యాంకర్లు, సర్వే వెస్సల్స్‌, ఆఫ్‌సక్షర్‌, ఆన్‌షోర్‌ ప్యాట్రోల్‌ వెస్సల్స్‌, హోవర్‌ క్రాప్ట్స్‌ తదితరాలను రూపొందిస్తోంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.20,803కోట్లు కాగా, దేశ నావికాదళం నుంచే దాదాపు 99 శాతం ఆర్డర్లు పొందినట్లు తెలిపింది.