గాయత్రి చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న విష్ణు మంచు, శ్రియ

Sriya, Vishnu
Sriya, Vishnu

 గాయత్రి చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న విష్ణు మంచు, శ్రియ

డాక్టర్‌ మోహన్‌బాబు ప్రధానపాత్రలో గాయాత్రి అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈచిత్రం టైటిల్‌ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈచిత్రంలో విష్ణు ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కన్పించబోతున్నారు.. విష్ణు నేటి నుంచి షూటింగ్‌ ప్రారంభించారు.. శ్రియ కూడ ఓముఖ్యపాత్ర పోషిస్తున్నారు. చిత్ర బృందం మోహన్‌బాబు, విష్ణు, శ్రియలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మదన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మోహన్‌బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్‌ అయిన శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు.. రామోజీ ఫిల్మ్‌సిటీలో జైసింహా షూటింగ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ ‘గాయత్రి సెట్స్‌కు వచ్చిన మోహన్‌బాబును, విష్ణును కలిసి వారితో కొంతసేపు ముచ్చటించారు..అనసూయ మేడ మీడ అబ్బాయి ఫేం. విమల్‌ కూడ ఈచిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.. ఎస్‌ఎస్‌ థమన్‌ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.