గాయం కార‌ణంగా చైనా ఓపెన్ సూపర్‌ సిరీస్‌కు శ్రీకాంత్ దూరం

Kidambi Srikanth
Kidambi Srikanth

ఢిల్లీః భారత అగ్రశ్రేణి షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌.. చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్‌ కాలుకు గాయమైంది. గాయాన్ని పరీక్షించిన వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో అతడు నవంబరు 14 నుంచి 19 వరకు జరిగే చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ..‘కాలు కండరాలు పట్టేయడంతో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి సూచించారు. దీంతో నేను చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో పాల్గొనడం లేదు. వారం రోజుల్లో నేను పూర్తిగా కోలుకుంటా. ఆ తర్వాత నవంబరు 21 నుంచి 26 మధ్య జరిగే హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌లో పాల్గొంటా’ అని తెలిపారు.