‘గానకోకిల’కు గిన్నెస్‌ పురస్కారం

P-Suseela
తెలుగింట ఇపుడు గానకోకిలలు ఎన్నున్నాయి అంటే.. అబ్బే చాలా ఉన్నాయి.. కాని ఆ కోకిలలకు మనోళ్లు చాన్సులు ఇస్తేగా.. సింగర్‌ సునీత అయినా, టాలెంట్‌ గీతామాధురి అయినా నాలుగు హిట్టు సినిమాల్లో ఒక్క పాటకు కూడ వీరిగొంతు మాత్రం విడపడటం లేదు.. కానీ అసలు సిసలైన గానకోకిల గా పేరుగాంచిన పి.సుశీల మాత్రం ఒకప్పుడు దాదాపు ప్రతిహిట్‌ అల్బమ్‌ని 3, 4 గీతాలు ఆవిడి శృతిలోనే మనం వినేవాళం..కదా..మీకు తెలుసా..ఇప్పటివరకు తెలుగుతో పాటు వివిధ దక్షిణాది భాషల్లోనూ.. అలాగే హిందీ వగైనా భాషల్లోఊ కలిపి ఆవిడ మొత్తంగా 17,695 పాటలు ఆలపించారు. ఆవిడ గొంతులోని మాధుర్యం, పాటకు ఆవిడ అద్దిన రసరమ్యత ఒక ఎత్తయితే.. సుశీలకు అన్నేసి అవకాశాలు ఇచ్చిన సంగీత దర్శకులప ఆత్ర కూడ అనిర్వచనీయం.. అందుకు ఇపుడు ఆమె పాడిన ఈ పాటల కౌంట్‌ను ‘ అమేజింగ్‌ ఈవెంట్‌ అంటూ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సువారు కొనియాడారు. ప్రతిపాటనూ లెక్కించి వారు జనవరి 28 2016 వరకు సుశీల 17,695 పాటలు పాడారంటూ ఒక సర్టిఫికెట్‌ కూడ ఇచ్చారు.
తెలుగింట 1935లో జన్మించిన సుశీల విజయనగరం సంగీత కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి గత 50 సంవత్సరాలుగా తెలుగవారిని తన సంగీతంతో ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. ఆమె అయిదు పర్యాయాలు జాతీయ అవార్డును పొందగా, తక్కిన అవార్డులు అనేకం ఆమె ఖాతాలో ఉన్నాయి. నీ పాట వినే కాలంలో జన్మించినందుకు మా జీవితం ధన్యమైంది అంటూ సంగీత ప్రియులు అంటున్నారు.