గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య పోరు

Israel Airstrikes in Gaza
Israel Airstrikes in Gaza-32 killed

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య పోరులో తాజాగా గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేయగా, ఇందుకు ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్‌ పైకి హమాస్‌ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగించారు. కాగా గాజాలో ఒక మసీదును ఇజ్రాయెల్‌ విమానాలు ధ్వంసం చేశాయని, ఈ ఘటనలో 132 మంది మృతి చెందారని, వీరిలో వారిలో 21 మంది మహిళల సహా 32 మంది చిన్నారులు, ఉన్నారని పాలస్తీనా అధికార వర్గాలు తెలిపాయి. గాజా సిటీలోని అసోసియేటెడ్‌ ప్రెస్‌, అల్‌ జజీరాతో పాటు పలు పత్రికా సంస్థల కార్యాలయాలు ఉన్నటువంటి బహుళ అంతస్తుల భవంతిని ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. భవనంలోని వారిని ముందుగా ఖాళీ చేయాలని ఆదేశించిన ఇజ్రాయెల్‌ మిలిటరీ, ఒక గంట తర్వాత ఆ భవనాన్ని క్షిపణుల సహాయంతో కూల్చివేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/