గాంధీ ఆస్పత్రిలో దక్షిణ కొరియా వైద్యబృందం

South Korea
South Korea

హైదరాబాద్‌: రాష్ట్రంలో అమలుఅవుతున్న ఆరోగ్య శ్రీ పథకం గురించి తెలుసుకొని తమ దేశంలో అమలు చేసేందుకు గాను దక్షిణ కొరియా నుంచి ఆరుగురు సభ్యులు గల వైద్య బృందం గురువారం గాంధీ ఆస్పత్రికి విచ్చేసింది. గాంధీ సూపరిండెంట్‌ డాక్టర్‌ పి.శ్రవణ్‌ కుమార్‌ను ఆరోగ్య శ్రీ ఇన్‌చార్జీ డాక్టర్‌ నరసింహారావు నేతను కలిసి వివరాలు తెలుసుకున్నారు. మూత్ర పిండాల విభాగం, గైనకాలజీ తదితర విభాగాలను సందర్శించి అక్కడ రోగులతో వారి అనుభవాలన తెలుసుకొని పథకం గురించి ప్రోగ్రామ్‌ వివరాలను తెలుసుకున్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 791 రాకల వ్యాదులను ఉచితంగానే నయం చేస్తూ యావత్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని దక్షిణ కొరియా వైద్య బృందం యంగ్లీ చీ అన్నారు. దక్షిణకొరియా బృందం ప్రతినిధి జెజంగ్‌షూ జాన్‌తో పాటు మన దేశ ప్రతినిధులు ప్రొఫెసర్‌ రామకృష్ణ, శ్రీలక్ష్మీ రామకృష్ణ పట్నాయక్‌ వారికి కార్యక్రమంలో సహాయ సహాకారాలు అందించారు.