గవర్నర్‌ను వెంటనే మార్చాలి

V.Hanumantha Rao
V.Hanumantha Rao

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నారని ఆయను వెంటనే మార్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతు ఈ విషయమై కేంద్ర హోంమంత్రిని కలిసి గవర్నర్‌పై ఫిర్యాదు చేస్తామన్నారు. బీసీలంతా ఏకమై.. పంచాయతీ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆర్డినెన్స్‌ తెచ్చి బీసీలకు అన్యాయం చేశారని వీహెచ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.