గవర్నర్‌ను కలువనున్న టి-కాంగ్రెస్‌ నేతలు

CONGRESS
T- CONGRESS

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలవాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వం రద్దుపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సిఎల్పీ సమావేశంలో సంపత్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పందించిన నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సోమవారం గవర్నర్‌ను కలిసి హైకోర్టు నిర్ణయాన్ని అమలు చేయాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.