గల్లా వ్యాఖ్యలపై జితేందర్‌రెడ్డి మండిపాటు

JITENDER REDDY
JITENDER REDDY

న్యూఢిల్లీ: టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని అన్న వ్యాఖ్యలపై తెలంగాణ ఎంపి జితేందర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల పూర్తి మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఎంపి జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికం ఎలా అవుతుందని ఎంపి ప్రశ్నించారు. అప్రజాస్వామిక అనే మాటను లోక్‌సభ రికార్డుల్లో నుంచి తొలగించాలని స్పీకర్‌కు జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.