గర్భిణుల నెలవారీ ఆహారం

Pragnantff
Pregnant Lady Food

గర్భిణుల నెలవారీ ఆహారం

అదేమిటే తల్లీ! నెలలు నిండుతున్నాయి. ఒళ్ళంతా నీరేమిటి? అంటూ ఆదుర్దాపడుతోంది తొలిసారి గర్భం ధరించిన కూతురుని చూసి ఓ తల్లి! కడుపుతో ఉన్న మరో ఇల్లాలు నెలలు నిండుతున్నా పొట్టపెరగటం లేదు. డాక్టరు గర్భస్థశిశువ్ఞ ఎదుగుదల సరిగా లేదన్నాడు. తను తండ్రి కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచీ ఆదుర్దా పడుతున్న ఇంజనీరు తన భార్య నీరసంగా, నిస్సత్తువగా ఎప్పుడూ విచారంగా ఉంటూంటే, బాధపడుతున్నాడు. ఇలాంటి వాటిని అధిగమించేందుకు చక్కటి పరిచర్యని సూచించారు. అదే గర్భిణీ పరిచర్య. దీన్నే ‘యాంటీనెటల్‌ కేర్‌ అంటారు. ఒక ప్రదేశానికో, ఒకరి ఆర్థికస్థితిని చూసో, ఒక వర్గమనో కాక ఈ విశ్వంలోని మహిళలందరూ అనుసరించతగిన ఆచరణీయమైన గర్భిణీ పరిచర్యను ప్రతిపాదించింది ఆయుర్వేదం. దీని పరమార్థం గర్భం నిండుగా ధరించేందుకు, ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు లోపల బిడ్డ చక్కగా, ఆయుష్మంతుడుగా ఎదగటానికి కావలసిన పరిచర్య చేయటం.
ఈ పరిచర్యలో ముఖ్యమైనది ఆహారనియమాలు పాటించడం, ఆయా సమయాలలో వచ్చేటువంటి సహజపరిణామాలు తల్లి ఆరోగ్యాన్ని, బిడ్డ ఆయుష్షుని పాడు చేయకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.

మొదటి మూడు నెలల్లో
గర్భధారణ సమయంలో ఆమె తీసుకునే ఆహారం జీర్ణమై రక్తంలో కలియటానికి తగిన రసంగా మారుతుంది. దాన్ని ఆయుర్వేదంలో ‘రసం అని, ఆధునిక వైద్యంలో న్యూట్రియంట్‌ అని అంటారు.ఇది మూడు భాగాలుగా మారి ఒకటి ఆమె ఆరోగ్యం, శక్తికి, మరోభాగం-లోపల శిశువు ఎదుగుదలకి, ప్రాణం నిలబడడానికి, మూడోభాగం స్తనాలని చేరి పుట్టబోయే శిశువ్ఞకి స్తన్యంగా మారడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల గర్భిణి తీసుకునే ఆహారం పోషకమై, తేలికయై చక్కగా జీర్ణంకాగలిగినవాడై ఉండాలి.

గర్భిణీ మొదటినెలలో తీసుకునే ఆహారం పిండం గట్టిపడడానికి, నిలబడటానికి అవసరమైనదై ఉండాలి. అందువల్ల ఆ నెలలో పటికబెల్లం పొడి కలిపిన పాలు తాగాలి. ఏ మందులూ తీసుకోకూడదు.

మామూలు ఆహారం సరైన సమయంలో తీసుకోవాలి. రెండవ నెలలో కూడా తల్లి మామూలు ఆహారం తీసుకుంటూ, రాత్రిళ్ళు పెరుగు తీసుకోకుండా పాలు, యాలకులు, పటికబెల్లం కలిపి తీసుకోవడం మంచిది. అలాగే ఎండుద్రాక్ష నానబెట్టి ఆ సారం తీసుకోవడం హితకరం. ఆవుపాలు అన్ని నెలల్లోనూ తీసుకోవడం మంచిది.

మూడవనెలలో గర్భం ఎదుగుదల జాగృతమవ్ఞతుంది. అందువల్ల పాలల్లో తేనె, నెయ్యి కలుపుకుని తీసుకో వాలి. కాని ఈ రెండూ సమానపాళ్లలో ఉండకూడదు. ఒక చెంచా నెయ్యి వేస్తే, రెండు చెంచాల తేనె కలుపుకుని తీసుకోవాలి. ఈనెయ్యి అనేక రసాయనాలు కలిపి తయారుచేసేది కాక స్వచ్ఛమైనది కావాలి. కరిగించిన వెన్న నుండి తీసిన నెయ్యినే వాడటం మంచిది. ఎందుకంటే ఈ నెయ్యి రసమై, విపాకమై వంటబట్టేటప్పుడు ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. వెన్నలా నెయ్యి క్రొవ్ఞ్వను పెంచేది పూర్తిగా కాదు. ఇది విటమిన్లను, మిగతా పోషకపదార్థాలని చిన్న ప్రేవ్ఞలలో రక్తంలో కలవటానికి ఉపయోగపడుతుంది. కదలిక తెలుస్తుంటే…

నాలుగవ నెలలో ఒక గ్లాసుపాలలో పావ్ఞ చెమ్చా అప్పుడే తీసిన వెన్న కలుపుకుని తీసుకోవడం మంచిది.

అయిదవ నెలలో ఆహారంతో పాటు ఒక గ్లాసుపాలల్లో అరచెమ్చా నెయ్యి కలుపుకుని, పటికబెల్లంపొడి కలుపుకుని రాత్రిపూట తీసుకోవడం మంచిది.

ఆరవనెలలో కడుపులో ఉన్న శిశువ్ఞ కదలటం తెలుస్తుంది.

ఏడవనెలలో శిశువ్ఞ పూర్తిగా లోపల కదలటం జరుగుతుంది. అందువల్ల ఆ నెలలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం కొద్దికొద్దిగా నాలుగు గంటల వ్యవధిలో తీసుకోవడం మంచిది. ఒక గ్లాసు వేడిపాలల్లో ఒక చెంచా ద్రాక్ష, మూడు చెంచాల ఎండుద్రాక్ష, మామూలు ఒక లవంగం పొడి కలిపి రాత్రి పూట తీసుకోవడం చాలా మంచిది.

ఏడవనెలలో తల్లికి దురదలు ప్రారంభమవుతాయి. అందువల్ల కొబ్బరినూనెలో పసుపు, గంధపుపొడి కలిపి పైన రాసుకోవాలి. ఈనెలలో ఉప్పు తక్కువ వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగాలి.

ఎనిమిదవ నెల జాగ్రత్తగా ఉండవలసిన మాసం. ఈ నెలలో వేడిపాలలో ఒక చెంచా బార్లీపొడి, అరచెంచా నెయ్యి కలుపుకుని తీసుకోవడం మంచిది. ఈనెల చివరిలో నువ్వులనూనెతో ఒకసారి ఎనీమా చేయించుకుంటే ప్రసవవాహికలు చక్కగా పనిచేసి సుఖప్రసవమౌతుంది.

గర్భదారణ సమయంలో ప్రతి రెండు గంటలకి అరగ్లాసు పళ్ళరసం తాగండి. ముఖ్యంగా ద్రాక్ష, బత్తాయి, యాపిల్‌ రసాలు మంచివి. చెరకు రసం తల్లి పాలని వృద్ధి చేస్తుంది. ఒకగ్లాసులో పది బాదంపప్పులు నానబె ట్టండి. ఒకరాత్రి నానిన తర్వాత కడిగి వాటిని రెండు ఖర్జూరాలతో నీళ్ళతో కలిపి పంచదార కలిపి ఇవ్వండి. ఇది గర్భిణీలకి అద్భుతమైన టానిక్‌. ఉదయం పూట మూడు ఇడ్లీ కాని, రెండు పుల్కాలు కాని, అల్లం, జీలకర్రలో వేసిన ఒక పెసరట్టు కాని తినండి. తర్వాత ఒక గ్లాసు మజ్జిగకాని, తాజా పళ్ళరసం కాగి తాగండి.