గర్భిణులకు ఫోలిక్‌ ఆసిడ్‌ తప్పనిసరి

This slideshow requires JavaScript.

గర్భిణులకు ఫోలిక్‌ ఆసిడ్‌ తప్పనిసరి

ఫోలిక్‌ ఆసిడ్‌ అనేది విటమిన్‌ బి9. దీన్నే టెరైల్‌ గ్లుటామిక్‌ ఆసిడ్‌ అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం మంది పిల్లలు పుట్టుకతోనే లోపాలతో జన్మిస్తుంటారు. ఫోలిక్‌ ఆసిడ్‌ లోపమే దీనికి ప్రధాన కారణమవ్ఞతుంది. బిడ్డ వెన్నెముక, మెదడుపై ప్రభావం చూపే న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌ శిశు మరణాలకు మూల కారణవ్ఞతుంది. సాధరణంగా గర్భం ధరించిన తొలి నెలలోనే ఎన్‌టీడి (న్యూరల్‌ట్యూబ్‌ డిఫెక్ట్స్‌) సమస్య మొదలవ్ఞతుంది. అంటే గర్భిణీ తాను గర్భం దాల్చానని తెలియడానికి ముందే ఈ సమస్య వస్తుంది.

మొట్టమొదట 1920లో ఫోలేట్‌ డిఫీషియన్సీ అనేమియా ఒకటేనని అనుకునేవారు. 1931లో లూసీవిల్స్‌ అనే శాస్త్రవేత్త గర్భధారణలో ఇది అనేమియాని తగ్గిస్తుందని తెలుసుకున్నాడు. 1950లో ఫోలిక్‌ ఆసిడ్‌ను ఆంటీ కేన్సర్‌ మందుగా వాడి సత్ఫలితాన్ని పొందారు. 2009 నుంచి గర్భీణీలే కాదు పిల్లల్ని కనే వయస్సులో వ్ఞన్న మహిళందరూ ఫోలిక్‌ ఆసిడ్‌ని తప్పనిసరిగా తీసుకోవాలిసిన అవసరాన్ని గుర్తించారు. తగినంత ఫొలిక్‌ ఆసిడ్‌ తీసుకోవడం ద్వారా ఏటా 1300 కేసుల్లో ఎన్‌టిడీ రాకుండా నిరోధించవచ్చు. ఫోలిక్‌ ఆసిడ్‌నే ఫోలేట్‌ అని అంటారు. తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా, బిడ్డలో లోపాలు రాకుండా ఉండాలంటే ముందు నుంచే ఫోలిక్‌ ఆసిడ్‌ తీసుకోవాలి. ముఖ్యంగా గర్భం తొలి టైమిష్టర్‌లో తీసుకుంటే చాలా మంచిది.

ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలంటే ఆహార రూపంలో కాని, టాబ్లెట్‌ రూపంలో రోజుకి 400-800 ఎమ్‌.జి.ఎమ్‌ లేదా 0.4-0.8మి.గ్రా తీసుకోవాలి. ఖరీదైన ఆహారం కాదు తీసుకోవలసినది. మనకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని,వారి ఆహారపు అలవాట్లని బట్టి దీన్నే అందరూ తీసుకోవల్సిందే.

చంటి పిల్లలు – 70- మెక్రోమి.గ్రా1-3 సంవత్సరాల పిల్లలు – 100 ఎం.జి.ఎం.
4-6 – 150ఎం.జిఎం 7-9 – 200ఎం.జి.ఎం. 10-12 – 250 ఎం.జి.ఎం. 13-15 – 300 ఎం.జి.ఎం గర్భిణీలు – 400-800 ఎం.జి.ఎం రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. ఫోలిక్‌ ఆసిడ్‌ పనులుః ఇది ఫోలెట్స్‌ రూపంలో లభ్యమదుతాయి. ఇది శరీరంలోని అనేక మెటబాలిక్‌ ఫంక్షన్స్‌లో పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్స్‌, ప్రోటిన్స్‌, (కొవ్ఞ్వపదార్ధాలు శరీర వినియోగానికి ఉపయోగపడుతుంది.

2. ఇది డి.ఎన్‌.ఎ దానికి ఉపయోగపడుతుంది. మరియు ఆర్‌,ఎన్‌.ఎ సింధసిస్‌కు కో ఎంజైమ్‌గా పనిచేస్తుంది. 3. ఇది ఆరోగ్యవంతమైన కణాలకు, ఎదుగుదలకు అవసరం. కణ విభజనకు, పిండంలోని కణాలు పునరుత్పత్తికి అవసరం. 4. ప్రోటీన్‌ సింధసిస్‌కు అవసరం. 5. విటమిన్‌ బి12 ఐరన్‌ వినియోగానికి అవసరం.

6. హోమో సిస్టిన్‌ తగ్గించడినికి, గుండె జబ్బులు రాకుండా నివారించడానికి అవసరం.

7. నరాలపై అమోఘశక్తి కల్గి వ్ఞంటుంది. న్యూరోట్రాన్స్‌మీటర్‌పై ప్రభావం చూపుతుంది.

8.మెటబాలిక్‌ ఆమినో ఆసిడ్స్‌ నిర్మాణానికుపయోగపడతాయి. 9.తరుచూ మూడ్స్‌ మారకుండా, డిప్రెషన్‌ రాకుండా సెరిటోనిన్‌ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది.
10. జీర్ణవ్యవస్థపై, నిద్ర, ఆకలిపై ప్రభావం చూపుతుంది. 11. న్యూక్లియక్‌ ఆసిడ్‌ సింధసిస్‌కు అవసరం. ఫోలిక్‌ ఆసిడ్‌ని శరీరం స్టోర్‌ (నిల్వ) చేయలేదు. కాబట్టి రోజు నేచరల్‌గా దొరికే ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవాలి. అధిక పరిమాణంలోని ఫోలేట్‌ యూరిన్‌లో వెళ్లిపోతుంది. ఎందుకంటే ఇది నీటిలో కరిగే విటమిన్‌ బి కాంపెక్స్‌ కాబట్టి.

ఫోలిక్‌ ఆసిడ్‌ ఉన్న ఆహారపదార్థాలు:

బొప్పాయి, కివి,ఆరెంజ్‌ నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లు, పండ్ల రసాలు. పాలకూర, తోటకూర, బ్రకోలి వంటి పచ్చని ఆకుకూరగాయలు బీన్స్‌, చిక్కుళ్ళు, ముల్లంగి పచ్చిబఠానీ, వంటి పచ్చని కూరగాయలు, పాలు, గ్రుడ్లు, మాంసం, లివర్‌, బీర్‌, సీఫుడ్‌, ఈస్ట్‌లు బీట్‌రూట్‌ గనిసగడ్డ (చిలగడ దుంపలు) ఖర్జూరుం, ఎండుద్రాక్ష తృణధాన్యాలు,పొద్దుతిరుగడు విత్తనాలు, స్పీనాక్‌ డైరీ (ప్రొడక్ట్స్‌) కాలిఫ్లవర్‌, బంగాళదుంపలు, మెలకెత్తినగింజలు, గోధుమపాలు, బ్రెడ్‌ వంటి ఆహార పదార్ధాల్ని ఎక్కువగా తీసుకో వాలి. పిల్లలు కావాలనుకునేవారు ప్రెగ్నెన్సీ రావడానికి 1నెల ముందు, ప్రెగ్నెన్సీ అని నిర్థారణ అయిన తర్వాత 3 నెలలు తప్పని సరిగా 0.4-0.8 మి.గ్రా ఫోలేట్‌ వాడాల్సి ఉంటుంది. గర్భీణీలే కాదు బాలింతలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.

– డా .కె. ఉమాదేవి, తిరుపతి