గర్భిణీలు- లివర్‌ వ్యాధులు

                            గర్భిణీలు- లివర్‌ వ్యాధులు

DOCTOR SUGGETION
DOCTOR SUGGETION

గర్భణులలో లివర్‌ మామూలుగానే ఉంటుంది. కానీ వారికి గర్భం రావడానికి ముందే లివర్‌ జబ్బు ఉన్న పోషకాహార లోపం, రక్తహీనత ఉంటే లివర్‌ వ్యాధి పెరగడానికి, కాంప్లికేషన్స్‌ కలగడానికి ఆస్కారం ఉంది. 3-10 శాంతం మంది గర్బిణుల్లో మాత్రమే లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫిజియోలాజికల్‌గా కార్టియాక్‌ అవుట్‌పుట్‌ ఎక్కువగా ఉండటం వల్ల గాల్‌బ్లాడర్‌ పని మందగించటం వల్ల లివర్‌లో పసరు సరిగా ప్రయాణించక పోవడం వల్ల పసరు (పైత్యం -బైల్‌) ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల, కొలస్ట్రాల్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల గర్భస్థ పిండం సైజు పెరిగి లివర్‌పై ఒత్తిడి కలగడం వల్ల రెండవ, మూడవ ట్రెమిష్టర్‌లో ఎక్కువగా లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. యుఎస్‌లో ఒక మిలియన్‌ మంది లివర్‌ వ్యాధులతో బాధపడితే అందులో 40,000 మంది గర్భిణీలు లివర్‌ ఇన్ఫ్‌క్షన్స్‌, లివర్‌వ్యాధులతో బాధపడటం జరుగుతుంది.
కారణాలు: – గర్భం రావడానికి ముందే జాండీస్‌, క్రానిక్‌ హెపటైటిస్‌ వంటి లివర్‌ వ్యాధులుండటం. – సిర్రోసిస్‌, పోర్టల్‌ హైపర్‌టెన్షన్‌ – ఆటో ఇమ్యూన్‌ హెపటైటిస్‌ – ప్రైమరీ బిలియరీ సిర్రోసిస్‌, ప్రైమరీ స్ల్కీరోజింగ్‌ కోలాంజైటిస్‌, విల్చన్‌డిసీజ్‌. – క్రానిక్‌ వైరల్‌ హెపటైటిస్‌-హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ హెపటైటిస్‌. – బుడ్‌ బైరీ సిండ్రోమ్‌ సైటో మొగలో వైరస్‌ హెపటైటిస్‌. – ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌ – గాల్‌ స్టోన్‌ డిసీజ్‌. – అక్యూట్‌ఫ్యాటీ లివర్‌ – ప్రీ వికాంప్ల్సియా, ఎకాంప్ల్సియా. – హెలీప్‌ సిండ్రోమ్‌. – హైపరేలిసిస్‌ గ్రాపిడోరం. – ఇంట్రాహెపాటిక్‌ కోలీస్టాసిస్‌ – లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌. వంటి అనేక లివర్‌ వ్యాధులు గర్భ ధారణ సమయంలో ప్రభావితం చేస్తాయి.
– వేవిళ్లు : గర్భధారణ తొలి 3-4 నెలల్లో వేవిళ్లు ఎక్కువగా కావడం సహజం. దీన్నే హైపరేమిసిస్‌ గ్రావిడేరం అంటారు. వెయ్యి మందిలో20 మందికి అబ్‌నార్మల్‌ లివర్‌ ఫంక్షన్స్‌ ఉంటాయి. బిలూరిబిన్‌ లెవల్స్‌ (4 మిల్లీగ్రామ్‌లు) ఆల్కలైన్‌ ఫాస్ఫటేజ్‌ రెండింతలు పెరుగుతుంది. ఇది హైపర్‌ థైరాయిడ్‌జిం (60%), నైక్రియాటిక్‌ ప్రాబ్లమ్స్‌, ముత్యాల గర్భం, డయాబెటిస్‌, కవలలున్నప్పుడు, అధిక సంతానం కలవారిలో, స్థూలకాయం ,జీర్ణకోశంలో అల్సర్‌ ఉన్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. దీనివల్ల గర్భిణీల్లో డీ హైడ్రేషన్‌, పోషకాహార లోపం, బరువు తగ్గడం, కీటోసిస్‌ వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.

– అక్యూట్‌ ఫ్యాటీ లివర్‌ : వెయ్యి మందిలో ఒకరికి ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా రెండవ ట్రెమిష్టర్‌లో వస్తుంది. ప్రీలికాంప్లినియా, బరువు తక్కువగా ఉన్నవారు, చిన్నవయస్సులో, 35 సంవత్సరాలు పైబడ్డ వారిలో గర్భధారణ జరిగినప్పుడు, జెనిటిక్‌ ప్రాబ్లం ఉన్నప్పుడు లివర్‌లో ఫ్యాటీఆసిడ్స్‌ ఎక్కువగా చేరడం వల్ల లివర్‌ ఫంక్షన్స్‌ తగ్గిపోయి లివర్‌ ఫెల్యూర్‌ వస్తుంది. ఇలాంటి వారిలో వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, నీరసం, కడుపునొప్పి, కడుపులో నీరు చేరటం, జాండీస్‌, అధిక దాహం,మూత్రవిసర్జన అధికంగా ఉండటం వంటి వ్యాధి లక్షణాలు కలుగుతాయి. వీరిలో డయాబెటిస్‌, రీనల్‌ పెయిల్యూర్‌ (50%), 50%మందిలో ప్రీ ఎక్లాంప్సియా వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. కాన్పు అయిన 48-72 గంటలకు రోగి రికవరీ అవుతారు. లివర్‌ ఫంక్షన్‌ వారానికి నార్మల్‌కి వస్తుంది.

– ఇంట్రా హెపాటిక్‌ కోలీస్టాసిస్‌ : మూడవ ట్రెమిష్టర్‌లో వెయ్యిమందిలో ఒకటి నుండి రెండు శాతం మందికి వస్తుంది. ఈ లివర్‌ ప్రాబ్లం యూరప్‌, ఉత్తర అమెరికాలో (10%) ఎక్కువగా వస్తుంది. గర్భనిరోధక మాత్రలు, అధిక సంతానం, వయస్సు పైబడ్డ తర్వాత గర్భధారణ రావడం వల్ల వస్తుంది. ఇది జెనిటిక్‌, హార్మోన్స్‌, ఎక్సోజెనిస్‌ ఫ్యాక్టర్స్‌ వల్ల (1.5-4)% మందిలో వస్తుంది. ఈ స్ట్రోజెన్సిని కోలీస్టాటిక్‌ అంటారు.

వీటి ప్రభావం వల్ల అబ్‌నార్మల్‌ ప్రొజెస్టిరాన్‌ మెటబాలిజం వల్ల ఇంట్రా హెపాటిక్‌ కోలీస్టాసిస్‌ లివర్‌ ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల అర చేతులు, అరికాళ్లులో దురదలు వచ్చి, ఛాతీ, ముఖం వరకు శరీరమంతటా వ్యాపిస్తాయి. రాత్రిళ్లు దురదలు ఎక్కువగా ఉండటం వల్ల రోగి నిద్ర పట్టక ఇరిటబుల్‌గా ఉంటారు. 10-15% మందిలో దురదతో పాటు జాండీస్‌, చలి , కడుపునొప్పి, విరోచనాలుంటాయి. కాన్పు అయిన రెండు రోజులకి వ్యాధి లక్షణాలు దానంతట అవే తగ్గిపోతాయి. ఈ లివర్‌ ప్రాబ్లం ఉన్నప్పుడు నెలలు నిండకుండా కాన్పుకావడం, గర్భస్థ పిండం చనిపోవడం, ప్లాసెంటలల్‌ లోపాలు, కార్టియన్‌ అరెస్ట్‌ వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.
– హెలిప్‌ సిండ్రోం : హీమోలైసిస్‌ ( ఎర్రకణాలవిచ్ఛిన్నం ), లివర్‌ ఎంజైమ్స్‌ ఎక్కువగా ఉండటం, ప్లేట్‌లెట్స్‌ తక్కువగా ఉండటాన్ని హెలిప్‌సిండ్రోం అంటారు. వెయ్యి మందిలో 1-6 మంది హెలిప్‌ సిండ్రోంతో బాధపడుతుంటారు. ఇది 4-12 % రోగుల్లో ప్రీ ఎకాంప్లియా ఉన్నప్పుడు, ప్రీ ఎంకాంప్లియా కాంప్లికేషన్‌ వల్ల వస్తుంది. 70% మందిలో 28-36 వారాల మధ్య మూడవ ట్రెమిష్టర్‌లో వస్తే 30% మందిలో కాన్పు అయిన తర్వాత వస్తుంది. ఈ లివర్‌ వ్యాధి వయస్సు మీరిన తర్వాత గర్భధారణ వచ్చినప్పుడు, తెల్లవారిలో ఎక్కువగా వచ్చే అవకాశముంది. దీని వల్ల గర్భణీల్లో ఉదరకోశంలో నొప్పి, వికారం, వాంతులు, ఒళ్లు నొప్పులు, 30-60% మందిలో తలనొప్పి, 17% మందిలో చూపులో తేడా, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలుంటాయి. ఈ లివర్‌ వ్యాధిని నెగ్లెక్ట్‌ చేసిన, సరైన చికిత్స సకాలంలో తీసుకోకపోవడం వల్ల పల్మోనరీ వాపు -అక్యుట్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌, సబ్‌క్యాప్సులార్‌ హెమటోమో, లివర్‌ ఇన్ఫెక్షన్‌, హెపిటిక్‌ ఫెయిల్యూర్‌, హెపాటిక్‌ రప్చర్‌ వంటి అనేక కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.

5. లివర్‌ రప్చర్‌ లేదా లివర్‌ హెమటోమా : 1884లో ఎబర్‌క్రోంబై అనే శాస్త్రవేత్త అరుదుగా గర్భిణుల్లో ఈ రకం లివర్‌వ్యాధి వస్తుందని తెలియ చేశాడు. 40,000-2,50,000 వేల మంది గర్భిణుల్లో ఒకరికి వస్తుంది. ఇంతవరుకు ప్రపంచ వ్యాప్తంగా 200 కేసుల్ని మాత్రమే గుర్తించారు. 30% మందిలో కాన్పు అయిన 48 గంటల్లో వ్యాధి లక్షణాలు తగ్గి నార్మల్‌కి వస్తుంది. 75% (కుడిలోబ్‌) 11% (ఎడమలోబ్‌), 14% మందిలో లివర్‌ లోని రెండు లోబ్స్‌ ఎఫెక్ట్‌ అవుతాయి. దీనివల్ల వీరిలో ఉదరకోశంలో నొప్పి, వికారం, వాంతులు, భుజం నొప్పి, కడుపుబ్బరం, లివర్‌ సైజు పెరగడం, హైపొటెన్షన్‌, షాక్‌, కడుపులో నీరు చేరడం, (అసైటీస్‌), ప్య్లూరల్‌ ఎప్య్లూజన్‌ (లంగ్స్‌ పొరల మధ్య నీరు చేరడం ) వంటి వ్యాధి లక్షణాలు, కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.
– ప్రైమరీ బిలియరీ సిర్రోసిస్‌ : అరుదుగా వస్తుంది. గర్భిణీల్లో వంధత్వం, నెలలు నిండకుండా కాన్పుకావడం, గర్భస్థ పిండం చనిపోవడం, జాండీస్‌, లివర్‌ ఫెల్యూర్‌ వంటి కాంప్లికేషన్స్‌, దురదలు, కుడుపులో నొప్పి, నీరు చేరడం వంటి లివర్‌ వ్యాధి లక్షణాలుంటాయి.
– ఆల్కహాలిజం : పాశ్చాత్య దేశాలలో ఆల్కహాల్‌ తీసుకోవడం నాగరికతకు చిహ్నంగా భావిస్తారు. 10%-15% మంది క్రానిక్‌ ఆల్కహాలిక్స్‌ గర్భం ధరించినప్పుడు ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌ అనే లివర్‌ వ్యాధి రావడం వల్ల వారిలో వంధత్వం, బహిష్టులోపాలు, అబార్షన్‌, నెలలు నిండకుండా డెలిలరీ కావడం, బిడ్డ చనిపోవడం ,ఆల్కహాలిక్‌ సండ్రోం ఏర్పడటం, ఎదుగుదల లోపం, రక్త హీనత, లివర్‌వాపు, నొప్పి వంటి లక్షణాలు కలుగుతాయి. – ఆటో ఇమ్యూన్‌ హెపటైటిస్‌ : 11% మందిలో గర్భధారణ సమయంలో, 25%మంది బాలంతల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న గర్భిణీల్లో వస్తుంది.

దీని వల్ల ప్రీ మెచ్యూర్‌ డెలివరీ కావడం, బరువు తక్కువగా ఉండటం, ఎదుగుదల లోపం, అవయవ లోపాలు, గర్భస్థ పిండం చనిపోవడం వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. 9. ప్రీ ఎక్లాంప్సియా: 20 వారాల తర్వాత కాన్పుకు 48 గంటల ముందు హై బిపి ప్రొటీన్స్‌ యూరిన్‌లో పోవడం, వాపులు , ఫిట్స్‌ వంటి ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా లక్షణాలు కన్పిస్తాయి. 10% మందిలో ఈ కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. దీని వల్ల లివర్‌ ఎఫేక్ట్‌ అయ్యి హెపాటిక్‌ వాపు, నొప్పి, జాండీస్‌ వంటి లివర్‌ వ్యాధి లక్షణాలు కలుగుతాయి.
– డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి