గద్వాలకు వరాల జల్లు కురిపించిన సియం కేసిఆర్‌

kcr
kcr

జోగులాంబ గద్వాల: సియం కేసిఆర్‌ ఇవాళ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గద్వాలలో జరుగుతున్న నడిగడ్డ ప్రగతి సభకు సియం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసిఆర్‌ గద్వాలకు వరాల జల్లు కురిపించారు. గద్వాల అభివృద్దికి రూ.100 కోట్లు మంజూరు చేస్తానని, ఆసుపత్రికి 300 పడకల ఆసుపత్రిగా మారుస్తానని సియం తెలిపారు. జిల్లాకు ఎస్సీ స్టడీ సర్కిల్‌, రెసిడెన్షియల్‌ పాఠశాల మంజూరు చేస్తామని, 584 మండలాల్లో బిసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాది కూడా మరో 119 బిసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని సియం హామీ ఇచ్చారు. బస్టాండ్‌ కోసం అభివృద్ధి కోసం రూ.2 కోట్లు, జూరాల వద్ద బృందావనం ఏర్పాటు కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తామని సియం తెలిపారు.