గతంలో 108, కోడి కత్తి ,ఇప్పుడు ఆవు డ్రామా…

LOKESH
LOKESH

అమరావతి: తన సభను అడ్డుకోవడానికి టిడిపి నేతలు ఆవును పంపారన్న వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. గతంలో 108 డ్రామా చేశారని, మొన్న కోడి కత్తి డ్రామా, ఇప్పుడు ఆవు డ్రామా చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. దీనికి స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌, కథ జగన్‌, విజయసాయి రెడ్డిలే అనటంలో సందేహం లేదని అన్నారు. ఇంత చెత్త నటనకు గాను భాస్కర్‌ అవార్డు ఇవ్వాలంటూ,జగన్‌ వివిధ సందర్భాల్లో చేసిన ఆరోపణల వీడియోను ఆయన పోస్టు చేశారు.