గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రత

Strengthening the security of the Republic of celebrations
– కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతాదళాలు
– మెట్రో నగరాలలోని విమానాశ్రయాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటన
– అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
హైదరాబాద్‌ : గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని వివిధ పట్టణాలలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే వీలుందని కేంద్ర నిఘావర్గాలు బుధవారం రాత్రి సమాచారం అంది చడంతో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమ య్యాయి. ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్‌, బెంగు ళూరు, తమిళనాడు, కేరళ, హైదరాబాద్‌తోసహా అన్ని మహా నగరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ భద్రతను కట్టుదిట్ట చేయడంతోపాటు, అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. జండా ఎగురవేసేందుకు సిద్దంగా ఉన్న అన్ని పరేడ్‌ గ్రౌండ్స్‌, వాటి పరిసరాలను పూర్తిగా పోలీసు వలయంగా మార్చేశారు. అనుమానాస్సద ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని, ఇటీవల పఠాన్‌కోట ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఎవరైనా మిగిలి ఉన్నా, లేదా అక్రమ చొరబాట్ల ద్వారా భారత్‌ భూ భాగంలోకి వస్తున్న వారి జాడపైనా భద్రతాదళాలు అనుమానం వ్యక్తం చేయడంతో నిఘా విభాగం తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేంద్ర ఇంటలిజెన్స్‌ తాజాగా హెచ్చరికలు జారీ చేయడంతో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఆయా పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించింది. హైదరాబాద్‌లోని దిల్‌షుఖ్‌గర్‌ జంట పేలుళ్ల సూత్రదారులు అయిన భత్కల్‌ బ్రదర్స్‌ ఐసిస్‌కు అనుబంధంగా దక్షణాసియా బాధ్యతలు చేపట్ట్డంతో మరింత అప్రమత్త్త నెలకొంది. దీంతో అక్టోపస్‌, ఇంటెలిజన్స్‌ బృందాలు కూడా తనిఖీలలో పాల్గ్గొనడం విశేషం. భత్కల్‌ సోదరలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు అయినప్పటికి హైదరాబాద్‌లో వారికి మంచి పట్టు ఉందని దిల్‌షుక్‌ నగర్‌ పేలుళ్లు రుజువు చేశాయి. దీంతో కేంద్ర హోంశాఖ ఉగ్రవాద విధ్వంసాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేనంత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలు కావడంతో ప్రభుత్వం రక్షణకు సంబంధించి ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది పట్టుబడిన ఐసిస్‌ సానుభూతిపరుడు మొహియుద్దీన్‌ సంఘటణతో పోలీసు వ్యవస్థ మరింత అప్రమత్తంగా ఉంది. అతను ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం విధితమే. అప్పటి పోలీసుల విచారణలో ఐఎస్‌ఐఎస్‌పై మరిన్ని వివరాలను మొయినుద్ద్దీన్‌ వెల్లడించాడు. తాను విజిటింగ్‌ వీసాపై దుబాయ్ వెళ్ళాలనుకున్నానని, అక్కడ తన ప్రియురాలిని పెళ్ళిచేసుకుని, ఆ తరువాత సిరియా వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా గత నెలలో కూడా ఐసిస్‌లో చేరేందుకు సిద్ధమయిన వారిని అరెస్ట్‌ చేయడమే కాక హైదరాబాద్‌లో ఉంటూ ఐసిస్‌ రాయభారిగా పనిచేసి మహిళను కూడా పోలీసులు పట్టుకున్నారు. అంతే కాక హైదరాబాద్‌లో గత ఏడాది ఉగ్రవాదంకు సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. దీంతో హైదరాబాద్‌లో విధ్వంసాలకు కుట్రపన్నే అవకాశం ఉంది. దీంతో ఆక్టోపస్‌ దళాలు బాంబు డిటెక్టివ్‌ టీంలతో పాటు ఇతర ప్రత్యేక విభాగలైన సిఐఎస్‌ఎఫ్‌, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దిగాయి. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ బలగాలు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. విజిటర్స్‌ను కూడా అనుమతించడం లేదు. బాంబ్‌స్వ్కాడ్‌ బృందాలు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌెండ్స్‌ పరిసరాలలో తనిఖీలు చేపట్టారు. ఇక నగరంలోని జనసమ్మర్థం బాగా ఉండే ప్రాంతాలలో అనువణువు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అనుమానిత వస్తువులు వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ రికార్డులు వినిపిస్తున్నారు. జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో సెక్యూరిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేని షాపింగ్‌ మాల్స్‌తో పాటు వివిధ రకాల వాణిజ్య సంస్థలను సీజ్‌ చేయాలని పోలీసులు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో భద్రత బలగాలు మాక్‌ డ్రిల్‌ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఏది ఏమైనా రిపబ్లిక్‌ డే వేడుకలను ఘణంగా జరిపేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.