గడ్కరీ,ఆరెస్సెస్‌ల ఆధ్వర్యంలోమోడీ హత్యకు కుట్ర

Shehla rashid 12
Shehla rashid

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ హత్యకు నక్సల్స్‌ భారీ కుట్రచేసారని ఓపక్క దేశవ్యాప్తంగా అతలాకుతలం అవుతుంటే జవహర్‌లాల్‌నెహ్రూ వర్సిటీ విద్యార్ధి హక్కుల కార్యకర్త షీలా రషీద్‌ మరో వివాదానికి తెరలేపారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలోనే హత్యకు కుట్రజరిగిందని ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలుచేసారు. ఈ హత్యోదంతం మొత్తం ముస్లింలు, కమ్యూనిస్టులపైనెట్టివేసేందుకుసైతం కుట్రరచన జరిగిందని అన్నారు.తదనంతరం ముస్లింలపై దేశవ్యాప్తంగా మరింతగా దాడులు అరాచకం చేయాలన్నది వ్యూహంగా ఉందని ఆమె ఆరోపించారు. అయితే రషీద్‌పేరును ఉటంకించకుండా గడ్కరీ తన ట్వీట్‌లో ఇలాంటి చట్టవ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకుంటానని, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత అభిప్రాయాలు తనకు అంటగట్టడంపై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. న్యాయపరంగా వెళతానని, ఇలాంటి ఘోరమైన వ్యాఖ్యలుచేసేవారిని ఉపేక్షించబోమని అన్నారు. మళ్లీరషీద్‌ విమర్శలతో తెరపైకి వస్తూ కేంద్రమంత్రిపై మళ్లీ వ్యాఖ్యలుచేసారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ నాయకుడు అనుచిత వ్యాఖ్యలుచేసారని, ఒక అమాయక విద్యార్ధి ఉమర్‌ ఖలీద్‌పై ఎలాంటి వ్యాఖ్యలు వచ్చాయో పరిశీలించాలని, మీడియా నిరాధారమైన విమర్శల దాడికి దిగిందని, ఆతనిపైనా ఆయన తండ్రిపైనా టైమ్స్‌నౌలో పలు విమర్శలుచేయడాన్ని ఆమె ఉటంకించారు. గడ్కరీజీ మీరు రాహుల్‌ శివశంకర్‌పైకూడా చర్యలు తీసుకుంటారా అని రషీద్‌ప్రశ్నించింది. నక్సల్స్‌ రాసినలేఖగా భావిస్తు విడుదలైన లేఖ తర్వాత వీరిద్దరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజీవ్‌గాంధీ హత్యతరహాలోనేప్రధానిమోడీని ఆయన నిర్వహించిన రోడ్‌షో ర్యాలీల్లో ఆత్మాహుతి బాంబర్‌సాయంతో మట్టుబెట్టాలనికుట్రలుచేస్తున్నట్లు పూణెపోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంప్రవాసంలో ఉన్న గ్యాంగ్‌ష్టర్‌ రవిపూజారినుంచి తనకు హెచ్చరికలు వస్తున్నాయని జెఎన్‌యు విద్యార్ధినేత ఉమర్‌ఖలీద్‌ ప్రకటించడం, ఆ తర్వాత తనకు నేరుగా హెచ్చరికలు రాలేదని, దళితనేత జిగ్నేష్‌మేవాని తనకు తెలిపారని ఆయనకు సైతం రవిపూజారినుంచి ప్రాణహాని హెచ్చరికలుఅందుతున్నట్లు వెల్లడించారు. పూణెపోలీసులు స్వాధీనంచేసుకున్న లేఖలో సారాంశం రాజీవ్‌హత్యతరహా ఉదంతంమళ్లీచేయాలన్నట్లుగానే ఉంది. ఆర్‌ అనే అక్షరంతో కామ్రేడ్‌ప్రకాష్‌కు రాసినట్లుగా భావిస్తున్న ఈ లేఖ రోనా విల్సోన్‌ అనేమావోయిస్టు ప్రతినిధి ల్యాప్‌టాప్‌నుంచి స్వాధీనంచేసుకన్నారు. విల్సన్‌, సుధీర్‌ ధవాలే, ఉరేంద్ర గాడ్లింగ్‌, మహేష్‌ రౌట్‌,షోమాసేన్‌లను పూణెపోలీసులు అరెస్టుచేయడంతో ఈవ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా పతాకస్థాయిలో చర్చనీయాంశం అయింది.