గజేంద్రుడు వాయిదా!

GAJENDRUDU2222
GAJENDRUDU

గజేంద్రుడు వాయిదా!

సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆర్‌.బి.చౌదరి నిర్మాతగా ప్రొడక్షన్‌ 89 గా రూపొందిన చిత్రం గజేంద్రుడు. ఆర్య, కేథరీన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది, అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ అనివార్య కారణాలతో విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. గజేంద్రుడు చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. నిర్మాత ఆర్‌.బి.చౌదరి గారు మాట్లాడుతూ.. హీరో హీరోయిన్స్‌ ఇద్దరూ పాత్రకు తగ్గట్టుగా పరకాయ ప్రవేశం చేశారు. కథకి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ ని మార్చుకున్నారు. 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా వేశాం. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం. గజేంద్రుడు ఈ సమ్మర్‌ కి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఫ్యామిలీ అంతా ఎంజా§్‌ు చేసే చిత్రంగా మా గజేంద్రుడు వుంటుంది అని అన్నారు. హీరో ఆర్య మాట్లాడుతూ.. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సులభం కాదు. చౌదరిగారి సపోర్ట్‌ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథరిన్‌ ఎంతో సపోర్ట్‌ చేసింది. డైరెక్టర్‌ రాఘవ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో పెద్ద దర్శకుడుగా ఎదుగుతాడు. ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది అని అన్నారు.