గజల్‌ శ్రీనివాస్‌లో ఒక మృగాడు ఉన్నాడు: మంత్రి

Manikyala rao
Manikyala rao

విజయవాడ: గజల్‌ శ్రీనివాస్‌పై బుధవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి మాణిక్యాలరావు వెనక్కుతీసుకుంటున్నానని అన్నారు. చిన్ననాటి నుండి ఉన్న పరిచయంతో గజల్‌ అరెస్టును తాను ఖండించానని ఐతే అతడు మహిళల పట్ల వికృత చర్యలకు పాల్పడటం చాలా బాధించిందన్నారు. శ్రీనివాస్‌ను తాను ఒక కోణంలో చూసి మోసపోయానని రెండో కోణం అతి జుగుప్సాకరంగా ఉందని, అతనిలో ఒక తెలియని మృగాడు ఉన్నాడని పేర్కొన్నారు.