గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయిః మంత్రి గుడివాడ

gudivada-amarnath

అమరావతిః ఏపీ కి వస్తున్న పెట్టుబడులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బిజినెస్ రిసోర్స్ యాక్షన్ ప్లాన్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 350 అంశాలు పరిగణలోకి తీసుకొని ర్యాంకు ఇచ్చాయని, అందులో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉందని అన్నారు.

ఏపీ ప్రభుత్వం ఏదో సంస్థకు ఉచితంగా భూములు ఇచ్చేస్తోందని నాదెండ్ల మనోహర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అమర్నాథ్ తెలిపారు. ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఆరోపించారు. స్కూల్ బ్యాగులు, పరిశ్రమలు గురించి తప్పుగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలతో తమకేంటి సంబంధం అని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.