గచ్చిబౌలిలో 9 గంటలకు కార్యక్రమం

Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే.  ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఎవరు, మిగతా నటీనటులు ఎవరు అనే వివరాలు తెలుసుకోవాలని అందరూ చాల ఆత్రుతగా ఉన్నారు. అందుకే  రేపు చిరు పుట్టినరోజు సందర్బంగా నటీనటుల వివరాల్ని ప్రకటించనున్నారు.  రేపు ఉదయం గచ్చిబౌలిలో 9 గంటల 30 నిముషాలకు జరగబోయే కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. అంతేగాక ఈ వేడుకలోనే సినిమా లోగోను, మోషన్ పోస్టర్ ను దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటి నుండే హంగామా మొదలుపెట్టేశారు.  ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనుండగా రామ్ చరణ్ నిర్మాణ భాద్యతల్ని భుజానవేసుకున్నారు.