గచ్చిబౌలిలో సుమధుర గ్రూప్‌ ఆక్రొపాలిస్‌

SAMUDRA 15
SAMUDRA 15

గచ్చిబౌలిలో సుమధుర గ్రూప్‌ ఆక్రొపాలిస్‌

హైదరాబాద్‌, అక్టోబరు 14: బెంగళూరులో అగ్రగామి రియాల్టీసంస్థగా పేరుపొందిన సుమధుర గ్రూప్‌ తాజాగా హైదరాబాద్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడల్లో 31 అంతస్తుల హైరైజ్‌ భవనాలకు శ్రీకారం చుట్టింది. 564 కుటుంబాలు నివసించేందుకువీలుగా అపార్టుమెంట్లు నిర్మి స్తున్నట్లు ప్రాజెక్టు ఛైర్మన్‌ మధుసూధన్‌జి వివరించారు. ప్రస్తుతం పదిలక్షల చదరపు అడుగుల స్థలం అమ్మకానికి అందుబాటులో ఉందని, 564 ఫర్నిచర్‌తో కూడిన విలాస వంతమైన లగ్జరీప్లాట్లను 1245చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 2బెడ్‌రూమ్‌, 3బెడ్‌రూమ్‌ ప్లాట్లు అందిస్తున్నట్లు ఆయన ప్రాజెక్టువివరాలను శుక్రవారం మీడియాకు వివరిం చారు. హైదరాబాద్‌ప్రాజెక్టుకు సుమధుర అక్రోపాలిస్‌గా పేరు పెట్టారు. నగరంలోని ప్రముఖ బహుళజాతి కంపెనీలు, ఐటి కారిడార్‌కు అతిచేరువలో ఆప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు వివరించారు. క్లబ్‌హౌస్‌, టెన్నిస్‌, మల్టీపర్పస్‌కోర్టు, ఆయాల గదులు, పచ్చికమైదానాలు, ధ్యానమందిరం, పక్షులపార్కు, స్విమ్మింగ్‌పూల్‌, ఓపెన్‌ ఎయిర్‌థియే టర్‌ అన్ని సంపూర్ణ వసతులతో ఈ ఆక్రోపాలిస్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లుమధుసూధన్‌ వివరించారు.