గ’ఘన ‘పథంలో భారత్‌ కీర్తి బావుటా

gslv c_37
gslv c_37

గ’ఘన ‘పథంలో భారత్‌ కీర్తి బావుటా

అగ్రరాజ్యాలకు మాత్రమే ఇప్పటివరకూ సొంతం అనుకున్న రోదసీ విజయం భారత్‌ కైవసం చేసుకుంది. ప్రపంచచరిత్రను తిరగరాసింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోని నిర్దేశిత కక్ష్యల్లోనికి ప్రవేశపెట్టి మన భారత ఖగోళ శాస్త్రవేత్తలు తిరుగులేని విజయాన్ని సొంతంచేసుకున్నారు. రోదసిలోనికి పయ నించిన వెనువెంటనే నిర్ణీత కక్ష్యల్లోనికి వేరువేరు ఉపగ్ర హాలు విజయవంతంగాప్రవేశించాయి. కేవలం భారత్‌కు చెందిన ఉపగ్రహాలే కాకుండా అమెరికాకు చెందిన భారీ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలోనికి పంపించగలగడం భారత్‌ అంతరిక్ష పరిశోధనలకు కొలమానం అని చెప్పా లి. అందులోనూ అంతరిక్షప్రయోగాల్లో తెలుగునేలపై నుండి ఇస్రో కొత్త అధ్యాయానికి తెరలేపింది. నెల్లూ రులోని సతీష్‌ధావన్‌ అంతరిక్షప్రయోగకేంద్రం వేదికగా ఒకేసారి 104ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచ దేశాల ను నివ్వెరపోయేలా చేసారు మన శాస్త్రవేత్తలు. మొత్తం ఉపగ్రహాలతో దూసుకెళ్ళిన పిఎస్‌ఎల్‌వి సి37 వాహక నౌక వాటిని అంతరిక్షంలోనికి ప్రవేశించిన వెంటనే నిర్ణీత కక్ష్యలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు మారిషస్‌ లోని ఇస్రోకు సంకేతాలందడంతో శాస్త్రవేత్తలకఠోర శ్రమ ఫలించింది.

ఇక భారత శాస్త్రవేత్తల అంతరిక్ష పరిశోధ నలకు ఆకాశమే హద్దు అన్నట్లు భారీ సంఖ్యలో ఉపగ్ర హాలుప్రయోగించి ప్రపంచ చిత్రపటంపై శెహభాష్‌ అని పించుకుంది.అమెరికాకుచెందిన96 ఉపగ్రహాలతోపాటు, ఇజ్రాయెల్‌, కజకిస్తాన్‌,నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యునై టెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలకు చెందిన ఒక్కోఉపగ్రహం ఈ పిఎస్‌ఎల్‌విద్వారా అంతరిక్షంలోనికి దూసుకుపో యాయి.ఈ ప్రయోగంతో ఏఅగ్రరాజ్యానికి భారత్‌ తక్కు వేమీకాదని మన శాస్త్రజ్ఞులునిరూపించారు గతంలోరష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపించిం ది. గత ఏడాది కూడా ఇస్రో ఒకేసారి తొమ్మిది ఉపగ్ర హాలను అంతరిక్షంలోనికి పంపించింది. పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ ఇప్పటివరకూ 225ఉపగ్రహాలను ప్రయోగించిం ది.

వీటిలో 179వరకూ విదేశాలనుంచి వచ్చినవే కావడం విశేషం.అంతేకాకుండా వచ్చేఐదేళ్లలో ఇలాంటివే మొత్తం మూడువేల ఉపగ్రహాలను అతిచిన్న షూబాక్స్‌ సైజు నుంచి 24 అంగుళాల టెలివిజన్‌సెట్‌ సైజువరకూ ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రయోగించే దిశగా భారత్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. విదేశా లకు చెందిన ఉపగ్రహాలనుప్రయోగించడం వల్ల వాటికి నిర్వహణ ఖర్చు తక్కువకావడం, అతితక్కువ వ్యయం తోనే నిర్ణీత లక్ష్యందిశగా వెళ్లేందుకు మార్గం సులువవ డంతో విదేశాలు కూడా భారత్‌ అంతరిక్ష పరిశోధనల పటిమపై ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంకు నిధులతో రూపొం దిస్తున్న ఉపగ్రహ వెంచర్‌ భారత్‌కు చెందిన భారతి ఒక భాగస్వామిగా ఉంది. ఒకేసారి 648 చిన్న ఉపగ్రహాలను కూడా ప్రయోగించి మారుమూల ప్రాంతాలకుసైతం ఇంటర్నెట్‌ను చేరువచేసే లక్ష్యంతో ఉన్నాయి. అలాగే ప్లానెట్‌ ల్యాబ్స్‌ అనేసంస్థ కూడా గూగుల్‌ ఉపగ్రహ మౌలికవనరులను కొనుగోలుచేసిపోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పిఎస్‌ఎల్‌వి)రాకెట్‌ ద్వారా 88సూక్ష్మ ఉపగ్రహా లను అంతరిక్షంలోనికి పంపే ప్రయోగాలు చేస్తోంది. అంతర్జాతీయంగా ఉపగ్రహాల వాహకనౌకలకు విపరీత మైనకొరతఉంది.వీటికితోడు చిన్న ఉపగ్రహాలను ప్రయో గించేందుకు అనువైనవేదికలు లేకపోవడంతో భారత్‌వైపు అగ్రదేశాలు చూస్తున్నాయి. ప్రైవేటురంగంలోనూ అమె రికా, యూరోప్‌లలో వివిధ ప్రయోజనాల కోసం ఉపగ్ర హాలను అంతరిక్షంలోనికి పంపిస్తున్నాయి.వాతావరణం, సముద్రజలాలపై పరిస్థితులు,మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్‌ చేరువచేసే లక్ష్యంతో ఈఉపగ్రహాల ప్రయోగం జరుగుతున్నందున భారత్‌ పిఎస్‌ఎల్‌వికి భారీ డిమాండ్‌ పెరిగింది.వీటికితోడు ప్రతి భా పాటవాల్లో తిరుగులేని సామర్ధ్యం చూపించిన మన ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుపై విదేశాలు గట్టినమ్మకంతో ఉన్నాయి.

అందువల్లనే ఒకేసారి భారీసంఖ్యలో ఉపగ్ర హాలు భారత్‌ కేంద్రంగా అంతరిక్షంలోనికి దూసుకువెళ్లా యంటే అనితరసాధ్యమైన రికార్డును భారత్‌ సొంతం చేసుకున్నదనే చెప్పాలి. 1962లో ఆర్యభట్టతో తనప్రయోగాలను ప్రారంభిం చిన ఇస్రో అతిచిన్న సౌండ్‌ రాకెట్లను పంపించింది. 1975లో రష్యాసాయంతో తొలిఉపగ్రహం ఆర్యభట్ట చేరవేసింది. 1979లో శ్రీహరికోట కేంద్రంనుంచి ఎస్‌ఎ ఎల్‌వి రాకెట్‌ సంధించి విఫలమైంది.1980లో రోహిణి, 1979-81మధ్యకాలంలో భాస్కర,1976లో సమాచార ఉపగ్రహం,1979లో యాపిల్‌ షమాచార ఉపహ్రంతో పాటు 1990కాలంలో విదేశీ రాకెట్లసాయంతో ఇన్సాట్‌- 1 నింగిలోనికి పంపించింది. ఆ తర్వాత చంద్రయాన్‌; మంగళ్‌యాన్‌ ఇతరప్రతిష్టాత్మక ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.

స్వదేశీ శాస్త్ర పరిజ్ఞానంతో మన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఉపగ్రహాల ప్రయోగంలో ప్రపంచానికే ఆద ర్శంగా నిలిచారని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. రష్యా,అమెరికా,చైనా దేశాలను అధిగమించేయత్నంలో భాగంగా భారత్‌ మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సైతం సిద్ధంఅవుతోంది.వ్యోమగాముల ఎంపికను కూడా చేపట్టిందంటే ఇస్రో పరిశోధనలు ఎంతవేగం పుంజుకు న్నాయో అవగతంఅవుతుంది.అలాగే అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగవాహిక నౌకను పునర్వినియోగం చేసుకునేవిధం గా సాంకేతికపరిజ్ఞానం వృద్ధిచేసింది. దీనివల్ల 80శాతం వ్యయం ఆదా చేసుకోవడంతోపాటు శాస్త్ర సాంకేతికపరి జ్ఞానంలో అగ్రదేశాలకు భారత్‌ తక్కువేమీ కాదని నిరూ పించగలిగింది. ఇస్రోశాస్త్రవేత్తల సత్తాను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఈప్రయోగాలు వీలుకల్పించాయి. మొత్తంగా చూస్తే 104 ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయో గాల్లో ప్రపంచంలో నంబర్‌వన్‌ భారత్‌ అనిపించుకుం దనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, వార్త