గంగపుత్రుల సంక్షేమానికి తోడ్పాటు

breaking news
breaking news

విద్యానగర్‌: గంగపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ హామీ ఇచ్చారు. ముషీరాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఠాగోపాల్‌ ను రాంనగర్‌ గంగపుత్ర సంఘం ప్రతినిధి బృందం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ముఠాగోపాల్‌ మాట్లాడుతూ ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పేదలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందేలా చూస్తానన్నారు. గంగపుత్ర సంఘం సభ్యులతో చర్చించి ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ను ఆదునీకరిస్తామన్నారు. గంగపుత్రుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తామని చెప్పారు. సంఘం చైర్మన్‌ కనుగుల రవి ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఠాజైసింహ. అధిక సంఖ్యంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ముషీరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో కనుగుల రవి తిరుపతిలో తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు.