ఖ‌మ్మం వాసికి సివిల్స్ లో 816 వ ర్యాంకు

BHARGAV SHEKHAR
BHARGAV SHEKHAR

ఖ‌మ్మంః ఇంట్లో అమ్మా, నాన్న, సోదరుడు ముగ్గురూ వైద్యులే. తానూ ఎంబీబీఎస్‌ చేశాడు. కానీ, వాళ్లలా డాక్టర్‌ కాకుండా సివిల్స్‌కు సన్నద్ధమై జాతీయ స్థాయిలో 816వ ర్యాంకు సాధించారు ఖమ్మంకు చెందిన డాక్టర్‌ భార్గవ్‌శేఖర్‌. ప్రస్తుతం రాష్ట్ర వైద్యశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ కల్యాణి దంపతుల కుమారుడు ఈయన. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక ఐఆర్‌టీఎస్‌ సాధించిన భార్గవ్‌.. ఐపీఎస్‌ కావాలన్న పట్టుదలతో మరోసారి సివిల్స్‌ రాసి అనుకున్నది సాధించారు.