ఖైరతాబాద్‌లో రెబల్స్‌తో బెడద

TRS, CONGRESS
TRS, CONGRESS

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు రెబల్స్‌ బెడద ఎక్కువైంది. ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను దాసోజు శ్రవణ్‌కు కేటాయిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ టికెట్‌ను ఆశించిన రోహిన్‌రెడ్డి అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు అభర్ధిగా పోటీ చేయాలని నిర్ణయించారు. అలాగే టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా దానం నాగేందర్‌ను బరిలో దింపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాని గత ఎన్నికల్లో పోటీ చేసిన మన్నె గోవర్దన్‌రెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో టికెట్ల కోసం ఆశావహులు ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే దానం కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయం తీరు పూర్తిగా మారిపోయింది. మన్నె గోవర్ధన్‌ రెడ్డి రెబల్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.